calender_icon.png 4 November, 2025 | 11:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత సన్మార్గం ఎంచుకోవాలి

04-11-2025 08:10:43 PM

ఖానాపూర్ అడిషనల్ ఎస్సై దూట జ్యోతి మణి..

ఖానాపూర్ (విజయక్రాంతి): ప్రస్తుత పరిస్థితుల్లో యువత చాలా జాగ్రత్తగా ఉండాలని, యువత సన్మార్గం ఎంచుకొని ముందుకుసాగాలని ఖానాపూర్ అడిషనల్ ఎస్సై దూటా జ్యోతిమని అన్నారు. మంగళవారం ఖానాపూర్ మున్సిపాలిటీలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో బజరంగ్దళ్, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మాట్లాడుతూ నేడు భారతదేశ భయంకర పరిస్థితులు ఎదుర్కొంటుందని దేశం యొక్క ఉన్నతి అస్తిత్వాన్ని నాశనం చేయడానికి యువతకు చెడు అలవాట్లు చేసి వారికి డ్రగ్స్ ని అలవాటు చేస్తున్నారు.

యువతను మత్తు వైపు నడిపించి వారిని ఎటువంటి పనులు చేయకుండా బలహీనులుగా, పిరికివాడుగా, నపుంసకుడిగా, చేస్తున్నారు. భౌగోళిక దృష్టితో చూస్తే భారతదేశం రెండు డ్రగ్స్ దొరికే దేశాల మధ్యలో ఉంది. భారతదేశ పశ్చిమాన గోల్డెన్ క్రేసెంట్ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్ దాంతో పాటు తూర్పు దిశలో గోల్డెన్ ట్రయాంగిల్ మయన్మార్, థాయిలాండ్, లావోస్, ఈ దేశాల మధ్యలో ఉండటం వల్ల మారకద్రవ్యాలు మన దేశంలోకి విరివిగా సరఫరా చేసి, యువతను నాశనం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే దేశంలో 6.5 కోట్ల మంది యువత డ్రగ్స్ కి బానిసగా మారారని ఇప్పటికైనా యువత చెడు మార్గం వైపు కాకుండా మంచి మార్గం వైపు వెళ్లాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మహాజన్ జితేందర్, దర్శనాల రాకేష్, కాషవేణి ప్రణయ్, తంగళ్ళపల్లి రాజశేఖర్, జోగు లోకేష్, ఆడిపో మధుకర్, సంజయ్, రోహిత్, తదితరులు ఉన్నారు.