calender_icon.png 4 November, 2025 | 8:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమరవీరుల ఆశయ సాధనకు పోరాటం

04-11-2025 04:02:17 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో శాస్త్రీయ నగర్, భగత్ సింగ్ భవన్లో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆఫీసులో మంగళవారం అమరవీరుల దినోత్సవం నిర్వహించారు. అమరవీరులకు సంతాపం తెలిపిన సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ నాయకులు ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి కె.రాజన్న మాట్లాడుతూ... దేశంలో సిపిఐ ఎంఎల్ కమ్యూనిస్టు పార్టీ ప్రజా సమస్యల పోరాటానికి 100 ఏళ్లుగా పోరాటం చేస్తుందని తెలిపారు. దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగాన్ని పేదరికాన్ని పారదోలడానికి ముందుకు రావాలని.

సాగు రంగం సమస్యల పరిష్కారం కోసం అమరవీరుల త్యాగాలను స్మరించుకొని ముందుకు పోవాలని పోరాడాలని ఈ దోపిడీ సమాజాన్ని తొలగించి ప్రజారాజ్యాన్ని సాధించుకోవాలని అందుకోసం మన విప్లవ వీరుల త్యాగాలు స్మరించుకుంటూ ముందుకు పోవాలని సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి కె.రాజన్న   విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి ముందు అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు మీ ఆశయాన్ని సాధిస్తామని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా నాయకురాలు కే లక్ష్మి  అధ్యక్ష వహించారు.