03-05-2025 05:08:43 PM
మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని విజయరామపురం అంగన్వాడి సెంటర్ లో విలేజ్ హెల్త్ శానిటేషన్ న్యూట్రిషన్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ పాల్గొని మాట్లాడుతూ.... పిల్లల బరువు ఎదుగుదల పర్యవేక్షణ గురించి జీరో నుంచి ఐదు సంవత్సరాల పిల్లలకు గర్భిణి బాలింతలకు పోషకాహారం పరిసరాల పరిశుభ్రత ఇమ్యూనైజేషన్ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సిడిపిఓ సూపర్వైజర్ కె పారిజాత, సూపర్వైజర్ శ్రీలత, గ్రామపంచాయతీ కార్యదర్శి బ్రహ్మారెడ్డి, హెల్త్ సూపర్వైజర్ జయమ్మ, ఐఎన్ఎంలు, నాగమణి, నరసమ్మ, ఆశ నాగమణి, అంగన్వాడి టీచర్ పద్మ ఆయా పిచ్చమ్మ, గర్భిణి స్త్రీలు బాలింతలు పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.