calender_icon.png 17 May, 2025 | 1:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ సమస్యలు పరిష్కరించాలని

17-05-2025 12:00:00 AM

ఎంపీడీవోకు బీఆర్‌ఎస్ వినతి 

గోపాలపేట మే 17 : గోపాలపేట గ్రామంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎంపీడీవో చంద్రశేఖర్‌కు బిఆర్‌ఎస్ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సంద ర్భంగా బి.ఆర్.ఎస్ నాయకులు మాట్లాడుతూ సర్పంచ్ల కాలం ముగిసిన తర్వాత గ్రామంలో పలు సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఏ కాలనీ చూసి నా పరుగు కాలువలు శుభ్రం లేక ప్రజలు రోగాలకు గురవుతున్నారని బీఆర్‌ఎస్ నాయకులు అన్నారు.

కొన్ని కాలనీలలో వీధిలైట్లు లేక రాత్రిల్లో కాలనీవాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు చీకటి పడిందంటే రోడ్డు ఎక్కే పరిస్థితి లేకుండా పోయిందని అన్నారు. ముఖ్యంగా తాగునీరు మిషన్ భగీరథ ద్వారా సరఫరా అయ్యే తాగునీరు కొన్నిచోట్లకే సరఫరా అవుతుంది అని అంతేకాకుండా మిషన్ భగీరథ తాగునీరు కొద్దిసేపు వచ్చిన వెంటనే బంధు అవుతుందని దానివల్ల ప్రజలు తా గునీరు కు అవస్థలు పడుతున్నారని తెలిపారు.

అధికారులు స్పందించి వెంటనే ప్రజలకు ఇబ్బం ది లేకుండా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని బి ఆర్ ఎస్ నాయకులు మాజీ సర్పంచ్ శ్రీనివాసులు బి ఆర్‌ఎస్ మండల అధ్యక్షులు బాలరాజు మాజీ వైస్ ఎంపీపీ శేఖర్ మాజీ ఎంపిటిసి కాశీనాథ్ మాజీ ఉపసర్పంచ్ సత్యనారాయణ. పోలికపాడు మాజీ సర్పంచ్ రాజు తదితరులు ఉన్నారు.