calender_icon.png 17 May, 2025 | 6:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్ష్యాలకు అనుగుణంగా ప్రగతి సాధించాలి

17-05-2025 12:00:00 AM

జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

నారాయణపేట మే 16(విజయక్రాంతి): నిర్దేశించిన లక్ష్యాల( టార్గెట్ ల) కు అనుగుణంగా ప్రగతి సాధించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.  శుక్రవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో కలెక్టర్  వైద్య ఆరోగ్యశాఖ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. జయచంద్ర మోహన్, డా. జయచంద్ర మోహన్, డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ డా. శైలజ, ప్రోగ్రాం అధికారులు, కోఆర్డినేటర్లతో ఆరోగ్య కార్యక్రమాలపై  సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాబోయే వర్షాకాలంలో పరిసరాల పరిశుభ్రత, నీటి ద్వారా ప్రభలే వ్యాధుల సంక్రమణ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అలాగే  జాతీయ కార్యక్రమాలైన క్షయ,లెప్రసీ, మలేరియా, ఎన్.సి.డి వంటి వ్యాధులను నివారించడాని కి లక్ష్యాలకు తగ్గట్టు ప్రగతి సాధించే విధంగా ప్రతి ప్రోగ్రాం అధికారి దృష్టి  సారించాలని  సూచించారు. హెల్త్ వెల్నెస్ సెంటర్లు ఎన్ని ఉన్నాయి?ఎన్ని నిర్మాణాలు పూర్తయ్యాయి?   

నిర్మాణ ద శలో ఎన్ని ఉన్నాయి?  మొదలైన వివరాలు అడిగి తెలుసుకున్నారు.  నిర్మాణాలు మొదలు పెట్ట ని సెంటర్ ల పై తొందరగా ప్రణాళిక రూపొందించి నిర్మాణాలు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని  ఆమె ఆదేశించారు. శ్యామ్, మ్యామ్ పిల్లలపై దృష్టి సారించి వారి ఆరోగ్య స్థితిలో మెరుగు పరిచే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

సమీక్షలో  ప్రోగ్రాం అధికారులు డాక్టర్ సుధేష్ణ, డాక్టర్ అనూష, ప్రోగ్రాం కోఆర్డినేటర్లు అశోక్ కుమార్, ఎం పి హెచ్ ఈ ఓ లు విజయ్ కుమార్, గోవిందరాజు, డిపిఓ బిక్షపతి, ఎన్కోస్ క్వాలిటీ మేనేజర్ గౌతమ్, టి బి సూపర్ వైజర్ శ్రీధర్, ఎల్డీ కంప్యూటర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.