27-11-2025 12:45:10 AM
గట్టు, నవంబర్ 26: గట్టు మండల పరిధిలోని మాచర్ల గ్రామంలో చేపట్టిన డ్రైనేజీ నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉండడంతో ఈ మార్గం గుండా రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ దారి గుండా సమీపంలో ఉన్న చెన్నకేశవ స్వామి గుడికి వెళ్లే భక్తులకు... అలాగే మండల కేంద్రానికి వెళ్లే వాహనదారులకు తీవ్ర అవస్థలు పడుతున్నట్లు ప్రజలు వాపోయారు. ఎవరైనా అనారోగ్యానికి గురై అత్యవసర పరిస్థితులు తలెత్తితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన స్థితి ఏర్పడుతుంది. సంబంధిత అధికారులు అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ పనులను తొందరగా పూర్తి చేసి గ్రామస్తుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని గ్రామస్తులు కోరారు.