27-11-2025 12:15:48 AM
-సర్పంచ్, వార్డు సభ్యులకు నామినేషన్లు
-స్థానిక గ్రామపంచాయతీలో నామినేషన్ల కోసం అధికారుల ఏర్పాట్లు
-పల్లెల్లో స్థానిక ఎన్నికల సందడి
కామారెడ్డి, నవంబర్ 26 (విజయక్రాంతి): సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలను ప్రభుత్వం ప్రకటించడంతో పల్లెలు సందడిగా మారాయి. శుక్రవారం సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. స్థానిక గ్రామపంచాయతీలో నామినేషన్లు దాఖలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి డివిజన్లో మొదటి విడత సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలు డిసెంబర్ 11న నిర్వహించ నున్నారు. పల్లెల్లో పంచాయతీ ఎన్నికల వేడి మొదలైంది.
మొదటి విడత జరగనున్న డివిజన్ లతోపాటు రెండో విడత ఎల్లారెడ్డి డివిజన్లో, మూడో విడత, బాన్సువాడ డివిజన్లో ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో ఆశావాహులు తాము పోటీలో ఉంటామంటూ గ్రామాల్లో సందడి చేస్తున్నారు. దీంతోపాటు వారి అనుచరులు హడావిడి చేస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో పాటు మొదటి విడుదల జరగనున్న కామారెడ్డి డివిజన్ లో శుక్రవారం నుంచి నామినేషన్లు వేసేందుకు అధికారులు ఏర్పాటు చేశారు.
కామారెడ్డి డివిజన్ లోని కామారెడ్డి మండలంలో 14 సర్పంచి స్థానాలకు 120 వార్డు సభ్యులు, రామారెడ్డి మండలంలో 18 సర్పంచ్ స్థానాలకు 166 వార్డ్ సభ్యులు, మాచారెడ్డి మండలంలో 25 సర్పంచ్ స్థానాలకు, 196 వార్డు సభ్యులు, బిబీ పేట మండలంలో 11 సర్పంచ్ స్థానాలు 110 వార్డు సభ్యులు, దోమకొండ మండలంలో తొమ్మిది సర్పంచ్ స్థానాలు 96 వార్డు సభ్యులు, భిక్కనూర్ మండలంలో 18 సర్పంచ్ స్థానాలు, 182 వార్డు సభ్యులు, పాల్వంచ మండలంలో 12 సర్పంచ్ స్థానాలు, 110 వార్డు సభ్యులు, రాజంపేట మండలంలో 18 సర్పంచ్ స్థానాలు, 158 వార్డు సభ్యులు, సదాశివ నగర్ మండలంలో 24 సర్పంచ్ స్థానాలకు, 214 వార్డు సభ్యులు, తాడువాయి మండలంలో 18 సర్పంచ్ స్థానాలకు, 168 వార్డు సభ్యులు స్థానాలకు పోటీ చేయనున్నారు. మొదటి విడ తలో కామారెడ్డి డివిజన్ లో 167 సర్పంచు స్థానాలకు, 1520 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
నేటి నుంచి నామినేషన్లు
కామారెడ్డి డివిజన్లో మొదటి విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు నామినేషన్లు శుక్రవారం నుంచి దాఖలు చేయనున్నారు. ఇప్పటికే కొందరు నామినేషన్లకు కావలసిన పత్రాలను సిద్ధం చేసుకోగా మరికొందరు హై రానా పడుతున్నారు.
మొదటి విడత 167 గ్రామ పంచాయతీలలో సర్పంచ్ ఎన్నికలు
కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి డివిజన్ లో డిసెంబర్ 11న మొదటి విడత ఎన్నికల ను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 167 గ్రామ సర్పంచ్ స్థానాలకు, 1520 వార్డు సభ్యుల స్థానాలకు, 1533 పోలింగ్ బూతులను ఏర్పాటు చేశారు. డిసెంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ పూర్తవుతుంది. మధ్యాహ్నం రెండు తర్వాత కౌంటింగ్ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.