calender_icon.png 17 September, 2025 | 6:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు

17-09-2025 04:31:34 PM

జాతీయ జెండాల ఆవిష్కరణ, స్వచ్ఛహిత సేవా కార్యక్రమాలు..

కోరుట్ల (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని గోధూర్, తిమ్మాపూర్, తిమ్మాపూర్ తండా, యామాపూర్, పక్కిర్ కొండాపూర్, వేములకుర్తి, బర్దిపుర్, మూలరాంపూర్, ఎర్దండి, కోమటి కొండాపూర్, వర్షకొండ, డబ్బా, అమ్మకపెట్, ఎర్రపూర్, ఇబ్రహీంపట్నం, కేశాపూర్, కోజన్ కొత్తూరు గ్రామాలలో బుధవారం ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ జెండాలను ఆవిష్కరణ చేసి వేడుకలను నిర్వహించారు. ఇబ్రహీంపట్నం తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ వరప్రసాద్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ మహమ్మద్ సలిం, వ్యవసాయ కార్యాలయంలో వ్యవసాయ అధికారి రాజ్ కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యలయంలో చైర్మన్ బోరిగాం రాజు ,విద్యుత్ ఉపకేంద్రంలో ఏఈ సతీష్, పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ అనిల్, మండల విద్యాధికారి కార్యాలయంలో ఎంఈఓ బండారి మధు, ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ హరీష్, వర్షకోండ, వేములకుర్తి, గోధూర్ రైతు వేదికలలో ఏఈఓలు, గ్రామపంచాయతీ కార్యాలయాలలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు జాతీయ జెండాలను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం స్వచ్ఛహిత సేవా కార్యక్రమాల సమావేశం నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో అయాగ్రామల నాయకులు, పలు శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.