13-09-2025 01:06:54 AM
మణుగూరు, సెప్టెంబర్ 12( విజ యక్రాంతి) : కంప్యూటర్ కాలంలో కూడా బాల్యవివాహాలు చేయటం బాధాకరమని, అలాంటి వివాహాలు లేని సమాజం కోసం మనమంతా కృషి చేయాలని,ఎయిడ్ సంస్థ మండల సోషల్ మొబలైజర్స్ జ్యోతికోరారు. బాల్య వివాహాల నిర్మూలనలో భాగం గా శుక్రవారం పెద్దమ్మ తల్లి ఆలయంలో సంఘంరూపొందించిన హెచ్చరిక బోర్డ్ను దేవాదాయశాఖ సహాయ కమిషనర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సోషల్ మొబలై జర్స్ జ్యోతి మాట్లాడారు.
ఎంత కష్టమొచ్చి నా ఆడపిల్లలు చదువును మధ్యలో ఆపివేయొద్దని అన్నారు. రక్షణ కోసం 1098, 100, మహిళల కోసం 181 హెల్ప్ లైన్ నెం బర్లు, షీ టీం సభ్యులు 24 గంటల పాటు ప నిచేస్తున్నా యన్నారు.ప్రత్యేక రక్షణ చట్టాలు సద్విని యోగం చేసుకోవాలనిసూచించారు. బాల్యవివాహాలతో జీవితం అక్కడే ముగిసి పోతుందన్నారు. బాల్యవివాహాల నిర్మూలనకై ప్రతిజ్ఞలు చేపిస్తూ ప్రజలను చై తన్య వంతం చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమం లో సంస్థ జిల్లా కోఆర్డినేటర్ రాజేష్,మౌనిక, మన్ సింగ్, మోహన్, ఆలయ సిబ్బంది పూ జారులు, పాల్గొన్నా రు.