22-09-2025 04:59:32 PM
చండూరు,(విజయక్రాంతి): పచ్చని పంట భూములను పాడు చేసే త్రిబుల్ ఆర్ మాకొద్దు అని రైతులు ఆవేదన చెందుతున్నారని, బలవంతంగా రైతుల దగ్గర భూములను లాక్కోవద్దని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. గట్టుపల్ మండల పరిధిలోని గట్టుప్పల, తెరటుపల్లి, నామాపురంగ్రామాలలో సిపిఎం సర్వే బృందం త్రిబుల్ ఆర్ పేరుతో భూములు కోల్పోతున్న రైతుల సమస్యలను వారు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గట్టుప్పల గ్రామపంచాయతీ కార్యాలయం ముందు రైతులతొ కలిసి వారు నిరసన తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గట్టుప్పల,తేరటుపల్లి, నామాపురం గ్రామాల రైతులు మా భూములు మాకే కావాలని, త్రిబుల్ ఆర్ వద్దని తమ గోడును సిపిఎం సర్వే బృందానికి వివరించారని ఆయన తెలిపారు. ఒకవేళత్రిబుల్ ఆర్ నిర్మిస్తే భూమికి భూమి కావాలని, ఆ కుటుంబంలో ఒక ఉద్యోగం ఇవ్వాలనిఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి నియోజకవర్గం లో త్రిబుల్ ఆర్ వల్ల భూములు కోల్పోతున్న రైతులకు ఎకరానికిసుమారు కోటి రూపాయల వరకు ఇచ్చారని రైతుల భూములపై ఎంత నష్టపరిహారం ఇస్తారో తేల్చి చెప్పాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సవాలు విసిరారు. ఒకవేళ త్రిబుల్ ఆర్ రోడ్ నిర్మిస్తే ఓపెన్ వాల్యూవేషన్ మీద భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం చెల్లించి ఇవ్వాలని ఆయన అన్నారు. ఈ ప్రాంత రైతులకు తెలవకుండా ఆలైన్మెంట్లు రూపొందించడం సరైనది కాదని, భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతే పనులు ప్రారంభించాలని ఆయన అన్నారు. త్రిబుల్ ఆర్ రోడ్ వల్ల రైతులు సారవంతమైన భూములు కోల్పోతున్నారని, భూములు కోల్పోతే జీవితాంతం రైతులు బతికేదట్లని ఆయన అన్నారు. భూమాతను నమ్ముకొని ఎన్నో ఏళ్ల నుంచి రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారని, త్రిబుల్ ఆర్ పేరుతో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం మంచి పద్ధతి కాదన్నారు. రైతులు తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పుకుందామని ప్రజా ప్రతినిధులు కలవడానికి వెళ్ళితే బలవంతంగా పోలీసులు రైతులను అరెస్టు చేయడానికి ఆయన తీవ్రంగా ఖండించారు. రైతుల సమస్యలను పరిష్కరించకపోతే ఆయా గ్రామాల రైతులతో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. త్రిబుల్ ఆర్ వల్ల భూములు కోల్పోతున్న రైతులకు, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని అమలు చేయాలని, 2013 చట్టాన్ని అమలు చేసి నష్టపోతున రైతాంగాన్ని ఆదుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారి అయిలయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం, సిపిఎం గట్టుప్పల మండల కార్యదర్శి కర్నాటి మల్లేశం, సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ, సిపిఎం గట్టుపల్ మండల కమిటీ సభ్యులు కర్నాటి సుధాకర్, కర్నాటి వెంకటేశం, పెద్దగాని నరసింహ, ముసుకు బుచ్చిరెడ్డి, త్రిబుల్ ఆర్ బాధిత రైతులు మోదుగు సత్తిరెడ్డి, శేఖర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, బండారి అంజయ్య, అల్వాల్ రెడ్డి, నాగిరెడ్డి, సుధాకర్ రెడ్డి, భీమగాని శ్రీరాములు, గుమ్మికొండ యాదగిరి రెడ్డి, బరిగల బిక్షమయ్య, బాణావత్ నాగ నాయక్, దుబ్బాక నరసింహ, భీమ గాని ఆంజనేయులు, వెంకటయ్య, మల్లయ్య, దుబ్బాక బజార్, దుబ్బాక నరసింహ తదితరులు పాల్గొన్నారు.