15 April, 2026 | 8:21 AM

యువతరమా మేలుకో.. పల్లెనేలుకో

02-12-2025 12:00 AM

తెలంగాణ గడ్డ మీద పల్లె పంచాయతీ మొదలైంది. దేశానికి పల్లె లు పట్టుకొమ్మలని మహాత్ముడు నినదిస్తే.. అదే పల్లెలకు పాలకవర్గాలు లేక రెండేళ్లు కావస్తుంది. ఇవాళ రేపు అంటూ ప్రభు త్వం కాలం వెళ్లదీసింది. అక్టోబరులో ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల కమిషన్ నోటి ఫికేషన్ జారీ చేసి, నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత బీసీ రిజర్వేషన్ల అంశంపై కోర్టుకు వెళ్లడంతో నోటిఫికేషన్ రద్దైంది.

ఎట్టకేలకు మరోసారి పంచాయతీ ఎన్నికలకు షెడ్యూలు విడుదల చేసింది. నామపత్రాల స్వీకరణ కూడా అధికారులు ప్రారంభించారు. రాష్ట్రం ఏర్పడ్డాక గ్రామపంచాయతీలకు జరుగుతున్న రెండో సాధారణ ఎన్నికల్లో యువత పాత్ర ఏం టి? రాజకీయాల్లో యువత పాల్గొనాల్సిన ఆవశ్యకత ఎంత? లాంటి విషయాల గురించి కాసేపు మాట్లాడుకుందాం.

దేశంలో దాదాపుగా 40శాతం యువ తే ఉండటం గర్వించదగ్గ విషయం. ప్రపంచంలో అన్ని దేశాల కంటే మనదేశంలోనే యువశక్తి ఎక్కువగా ఉంది. దీంతో ఏ విషయంలోనైనా ప్రపంచాన్ని జయించే సత్తా ఉంది. కానీ, అన్నీటికీ రాజకీయ అధికార మే మూలమైనప్పటికీ.. యువత మాత్రం రాజకీయాలంటే కంపు అనే ధోరణిలో బతుతుకున్నారు. కానీ, ప్రజాస్వామ్యంలో పాలిటిక్స్దే కీ రోల్ అని యువత ఇప్పటికైనా జ్ఞానోదయం చేసుకోవాల్సిందే.

తమ ఆసక్తి తగ్గట్టు చదువుకున్నామా.. ఓ ఉద్యో గం చూసుకున్నామా.. ఇన్‌స్ట్రాగాంలో రీ ల్స్ చూసామా అన్నట్టు సాగిపోతోంది. రే పటి తరాన్ని నడిపించేందుకు నాయకులు తయారు కావాలి కదా. నేటి యువతే కదా రేపటి సీనియర్ సిటిజన్స్ అయ్యేది. ఈరో జు ప్రయాణం ప్రారంభిస్తేనే కదా కొన్నేళ్ల తర్వాత ఉద్దండుడు అనే పేరు వచ్చేది. ఒకేసారి రాజకీయ దురంధరులుగా మారరు కదా. అందుకే అందివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని గ్రామ ప్రథమ పౌరులుగా జర్నీ స్టార్ట్ చేస్తేనే భవిష్యత్లో చట్టస భల్లో గళం వినిపించొచ్చు. 

జాతీయ ఉద్యమంలో పాల్గొన్న నాయకులే దాదాపుగా స్వాతంత్య్రం వచ్చిన త ర్వాత చట్టసభలకు ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత తరంలో కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని యువత రాజకీయాల్లోకి వచ్చారు. ఇలా ఓ రెండు దశాబ్దాల పాటు కొనసాగినట్టు చరిత్రను బట్టి తెలుస్తుంది. అంతేకాకుండా కళాశాలల్లో విద్యా ర్థి ఎన్నికలు ఉండటం వల్ల రాజకీయ నా యకులు అక్కడే తయారయ్యారు. కానీ, స్టూడెంట్ ఎన్నికలు రద్దు చేయడం వల్ల కిందిస్థాయి నుంచి నాయకులు తయారవ్వడం ఆగిపోయింది.

పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాల్లో పనిచేసినవారు కొంతమంది ఎదుగుతున్నప్పటికీ ఎన్నికల్లో పోటీ చేయడం చాలా అరుదుగా ఉంటుం ది. ఎందుకంటే.. ఆయా పార్టీల నాయకుల వారసుల పారాచూట్ ఎంట్రీతో అనుచరులుగానే మిగిలిపోతున్నారు. ప్రస్తుతం తెలు గురాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వంటి వారు విద్యార్థి రాజకీయాల నుంచి రాగా.. మాజీ ముఖ్యమంత్రులు చంద్రశేఖర్ రావు, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల నుంచి ఎదిగినవారే. అం దుకే గ్రామస్థాయి నుంచి ప్రస్థానం ప్రారంభిస్తే రేపటి లీడర్ల కొరత తీరుతుంది. కింది నుంచి వచ్చిన లీడర్‌షిప్‌కు క్షేత్రస్థాయి సమస్యల పట్ల అవగాహన కూడా ఎక్కువే కాబట్టి మెరుగైన పాలనకు అవకాశం ఉంటుంది.

వాస్తవానికి అనేక సమస్యలను తమ మేథోసంపత్తితో పరిష్కరించే శక్తి యువతకు ఉంది. సోషల్ మీడియాలో చూస్తుం టాం చాలా విషయాల్లో యువత టాలెం ట్. కానీ, అది ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రాం, యూ ట్యూబ్, ట్విట్టర్‌కే పరిమితం అవుతుంది. ఒకసారి చరిత్ర తిరగేసి చూస్తే.. ఏ ఉద్య మం సక్సెస్ అయిందన్నా దాంట్లో యువ త పాత్రే కీలకమైనది. అలాంటి యువత రాజకీయాలంటే కంపు అంటూ తిట్టుకుంటూ కూర్చోవటం ఫ్యాషనైపోయింది.

కానీ, ఆ కంపు రాజకీయమే వ్యవస్థను శాసిస్తుందని మరిచిపోతున్నారు. కుళ్లిన రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి మాత్రం ముందుకురావడం లేదు. విమర్శించుకుంటూ ఇంట్లో కూర్చుంటే అదే నాయకుల వారసులే రాజ్యమేలుతారు. సిస్టం బాగాలేదు, సర్వీస్ సక్కగా చేస్తలేరని నాలుగ్గోడల మధ్య గొనుక్కోవడం తప్ప చేసేదేం ఉండదు. అందుకే వివిధ రంగా ల్లో తమ శక్తియుక్తులను ఉపయోగించి సంస్థల అభివృద్ధికి ఎలాగైతే దోహదపడుతున్నారో.. మన దేశాన్ని, రాష్ట్రాన్ని, గ్రామా న్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించేందుకు యువత ముదుకు రావాల్సిన అవసరం ఉంది.

ఎంత దూరపు ప్రయాణమైన ఒక అడుగుతోనే మొదలైనట్టే.. రాజకీయంలో ఓ నాయకుడిగా ఎదగాలంటే ముందు అటువైపుగా అడుగులు వేయడం ప్రారంభించాలి. అందుకే సమాజం పట్ల అవగాహన ఉన్న యువత రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి పల్లెల సమగ్రాభివృద్ధికి, భవిష్యత్ రాజకీయ నేతల తయారీకి పునాది వేస్తారని ఆశిద్దాం. యువత రాజకీయాల్లోకి వస్తే ఆధునిక సాంకేతిక నైపుణ్యంతో పాలనలో నూతన అవిష్కరణలకు అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ఓటరైతే మీ భవిష్యత్తును నిర్ణయించే మీ ఓటు హక్కును వినియోగించుకోవడంలో జాగ్రత్త వహించాలి.

మెరుగైన స్థానిక పాల న, అభివృద్ధిని పొందాలంటే, ఓటర్లు నిష్క్రియాత్మకంగా కాకుండా, క్రియాశీలకంగా వ్యవహరించాలి. మీరు పోలింగ్ బూత్‌కు వెళ్లే ముందు, మీకు అందుబాటులో ఉన్న అభ్యర్థిని చాలా జాగ్రత్తగా, నిశితంగా అంచనా వేయాలి. ఒక అభ్యర్థిని కేవలం వారి డబ్బు, మాటల ఆధారంగా కాకుండా, వారి గత చరిత్ర, నిబద్ధత, స్థానిక సమస్యలపై వారికి ఉన్న అవగాహనను అంచనా వేయాలి. వారికి సమస్యల ను పరిష్కరించే వారి కార్యాచరణ ఉందా? లేదా? అనేది యోచించి ఓటు వేయాలి. గ్రామాభివృద్ధి కోసం వారి వద్ద ఉన్న నిర్దిష్టమైన, ఆచరణ సాధ్యమైన ఆలోచనలు ఏంటో తెలుసుకోండి.

కేవలం ఉపరితల హామీలను విశ్వసించకుండా, వారు గ్రా మంలో నీరు, పారిశుధ్యం, విద్య, వైద్యం, రహదారుల వంటి అత్యంత ప్రాథమిక అవసరాలను తీర్చగలరా లేదా అని లోతుగా విశ్లేషించండి. తక్షణ ప్రయోజనాలను ఆశించి మీ ఓటును అమ్ముకోవద్దు. ఎందుకంటే ఈ ఒక్క నిర్ణయం రాబోయే ఐదేళ్ల గ్రామాభివృద్ధిని నిర్ణయిస్తుంది. మీ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవ డం అంటే, కేవలం పోలింగ్ రోజున ఓటు వేయడం మాత్రమే కాదు. నిజాయితీ, ని స్వార్థ సేవకు సిద్ధంగా ఉన్న వ్యక్తికే ఓటు వేసి, మీ గ్రామ భవితవ్యాన్ని మీరే తీర్చిదిద్దుకోండి.