02-12-2025 12:00:00 AM
దేశంలో ఎత్తున ఆకాశాన్ని తాకే ఎత్తున విగ్రహాలు నెలకొల్పడానికి అడవులను ఛిద్రం చేసి, పర్యావరణాన్ని భ్రష్టు పట్టించి వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, ఈ దేశ మూలవాసులైన వారి సంక్షేమం పూర్తిగా తుంగలో తొక్కింది. భారతదేశంలో దేశీయ భాషలు తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటున్నాయి. సరైన నోటిఫైడ్ డీనోటిఫైడ్ కమ్యూనిటీల భాషలపై పరిశోధన ఇంకా నిర్వహించబడలేదు. అనేక దేశాల్లో రక్షణ కోసం అనేక నమూనాలు అందుబాటులో ఉన్నాయి.
ఈ వ ర్గాలకు చెందిన భాషలు. భారతదేశం భాషాపరంగా ప్రసిద్ధి చెందింది సాంస్కృతిక వైవిధ్యం. అయితే అధికారిక గణాం కాలు లేవు. ఇప్పటివరకు ఎన్టీ/ ఎస్‌ఎన్టీ /డీఎన్టీ కమ్యూనిటీల భాష మాట్లాడేవారికి సంబంధించినది. కొన్ని అంచనాల ప్రకారం ఎన్టీ / ఎస్‌ఎన్టీకి చెందిన 198 సంఘాలు ఉన్నాయి. డీఎన్టీ కమ్యూనిటీలు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వాటిపై విస్తరించాయి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలోనే 59 సెక్ష న్లు ఉన్నాయి, వారి స్వంత మాండలికాల తో ఎన్టీ/ ఎస్‌ఎన్టీ / డీఎన్టీ సంఘాలు. ప్రతి సంఘం ఉంది విస్తారమైన జ్ఞానం, వారి ఔషధ అభ్యాసం, పర్యావరణ జ్ఞానం, వా తావరణ నమూనాలు, ఆధ్యాత్మిక వైఖరులు, కళాత్మక, పౌరాణిక కథలు.
వీరి కళలు ఇంతకు ముందు జంగం కథలుగా ఈనాడు, బుర్రకథగా పిలువబడుతుంది. ఒకనాడు మత ప్రబోధానికి, దేశభక్తికి ప్రతిబింబంగా నిలబడిన జంగం కథా కళారూపం రాను రాను యాచనకు, ఉదర పోషణకూ ఉపయోగపడి తిరిగి ఈనాడు దేశభక్తిని ప్రబోధిస్తూ, ప్రజా సమస్యలను చిత్రిస్తున్నది.
జంగం కథలు చెప్పే వారిని బుడిగె జంగాలని పిలుస్తారు. బుడికెను కంచుతో గానీ ఇత్తడితో గానీ తయారు చేస్తారు. గుమ్మెటకు ఒక వైపు బెత్తపు చత్రా న్ని బిగించి, తోలుతో మూస్తారు. రెండవ పక్కన కూజామూతిలాగా, అనాచ్ఛాతీతం గా వుంటుంది. కథకునికి ఇరు ప్రక్కల వున్న వంత గాళ్లు ఒక్కొక్కరూ తమ గుమ్మెటను చంకకు తగిలించుకుంటారు.
కుడి చేతివేళ్లతో, చర్మం పైన వాయిస్తూ రెండో ప్రక్క మూస్తూ గుంభనగా శబ్దాన్ని తెప్పిస్తారు. కథ చెప్పె బుడిగె జంగం నిలువు టంగీ తొడిగి, తలపాగా చుట్టి, కాళ్లకు గజ్జెలు, మువ్వలు కట్టుకుని, భుజం మీద తంబురాను ధరించి, చేతి వేలికి అందెలు తొడిగి, వాటిని తంబురాకు తట్టుతూ రెం డవ చేతితో తంబురా తీగను మీటుతూ కథను ప్రారంభిస్తారు.
కథకునికి వంతలు గా వున్న వారు గుమ్మెటలు ధరించి కథకునికి పంత పాడుతూ, పాట వరుస ననుస రించి గుమ్మెటలను వాయిస్తూ మధ్య మ ధ్య హాస్యగాడు చలోక్తులతో హాస్యాన్ని కుమ్మరిస్తూ, ప్రేక్షకుల్ని నవ్విస్తూ వారి మెప్పు పొందుతాడు. ఆంధ్రప్రదేశ్‌లోని షెడ్యూల్డ్ తెగలు, సంచార డీనోటిఫైడ్ తెగలు ప్రధానమైనవి వారు మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్నారు.
కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టాలి. జటాపు, కొండ దొర, మూక దొర, మన్నె దొర, సవర, గదబ, చెంచు, కోయ, గొంది ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన ఆదిమ గిరిజన సమూహాలున్నాయి. దాసరి, ఎరుకల, యానాది, సుగాలి, కొరవ, కొరచ, కైడై న క్కలా ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని డినోటిఫైడ్ తెగలు. ఇంకా, వడ్డెర, పాముల, నిర్షికారి, బుడబుక్కల, మందుల, పూసల, గంగి, రెడ్దుల, బోయ, దొమ్మర, జోగి సంచార పాక్షిక సంచార తెగలలో కొన్ని.
సాంప్రదాయ అంటరానితనం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా అత్యంత సాంఘిక, ఆర్థిక వెనుకబాటుతనానికి గురికావడం ప్రధాన అ ర్హత కలిగిన షెడ్యూల్ కులాల్లో ఇంకా అణగారిన, ఏమాత్రం గుర్తింపు లేని జంగమ దేవర, డక్కలి, కిన్నెర జోగులు, బేడ బుడగ జంగాల కులాలు నేడు కనుమరుగై పోతున్నాయి. జంగమోళ్లు వీరిని జంగం దేవర అని కూడ అంటారు.
వీరు శివ భక్తులు. నొసటన వీభూతి ధరించి చేతిలో పెద్ద గంట పట్టుకొని వాయిస్తూ సంక్రాంతి సం దర్భంగా ఆ నెల అంతా తెల్ల వారు జా మున వీదుల్లో తిరుగుతు శివ కీర్తనలు చే స్తూ, ఆ రోజు తిథి, వార, నక్షత్ర ఫలాలను తెలిపి తెల్లవారాక ప్రతి ఇంటికి వచ్చి సం భావన తీసుకునే వారు. అప్పటికే వీరు అంతిమ దిశలో వుండే వారు. వీరు అంతరించి చాల కాలమే అయింది.
జంగం వా రి జనాభా అతి తక్కువ. ముఖ్యంగా వీరు శివ భక్తులు. వీర భద్రుని ఆలయాల్లో పూ జారులు వీరే వుంటారు. గతంలో వీరు కొన్ని పల్లెలను తమలో తమకు కేటాయించుకొని ఆ పల్లెల్లో కార్తీక మాస నెలంతా తెల్లవారు జామున తిరుగుతూ గంట వా యిస్తూ, శివనామ స్తుతి చేస్తూ తిథి, వార, నక్షత్రాలను చెప్పి, తెల్లవారి ప్రతి ఇంటి ఆసామి వద్ద సంబావన పొందుతారు.
ఇ లా తిరిగే వారిని జంగం దేవర అని అం టారు. వీరు శుభాశుభాలు చెప్పుతారు. వీరికి సమాజంలో బ్రాహ్మణుల తర్వాత గౌరవ స్థానం వీరిదే. వీరి వేషధారణ కూ డ గౌరవ ప్రదంగా వుంటుంది. కాషాయ వస్త్రాలు ధరించి, తలపాగా కట్టి, భు జాన కావడి లేదా జోలే, ఒక చేతిలో గంట, రెం డో చేతిలో శంఖం ఉంటుంది. శివ స్తుతి చేస్తూ గంట వాయిస్తూ, మధ్య మధ్యలో శంఖాన్ని పూర్తిస్తారు.
వీరిని పల్లె ప్రజలు శుభప్రదంగా భా వించేవారు. వీరు కుల వృత్తి ఏనాడో మం టగలిసింది. ఎక్కడో కొందరు మిగిలిన వారు తమ పూర్వీకులు నేర్పిన విద్య భిక్షాటనకు ఉపయోగించుకుని జీవనం సాగి స్తున్నారు. షెడ్యూల్డ్ కులాల జాబితాలో 9వ కులం బేడ బుడగ జంగం. బుడిగ, బేడ ఇలా రెండు రకాలుగా పిలువబడతా రు. వీరు బుర్ర కథలు చెబుతారు. పగటివేషాలు . భిక్షాటన ఇవన్నీ వీరి కుల వృ త్తులు. వీరికి సొంత భాష ఉంది.
పెరుగుతున్న సాంకేతిక తో పోటీ పడలేక తమ తె గలు తరుగుతున్నది అని వాపోతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం పౌర సమాజం తమ కళను పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో వ్యవసాయ కూలీలు కార్మికులు, తాపీ మేస్త్రిగా రూపాంతరం చెందారు. ఉన్న కొద్ది మంది కడుపు నింపుకోడానికి చిన్న చిన్న కమతాల్లో పోడు సేద్యం చేసుకొని జీవిస్తున్నారు. భారత్‌లో సంచార జాతులు, విముక్త జాతులు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలకు సమగ్ర మైన, మానవీయ పరిష్కారాలు అవసరం.
నిరంతరంగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తిరిగే జీవనం, స్థిర నివాసం లేకపోవడం వలన వీరు విద్య, వైద్యం, రేషన్ కార్డులు, ఆధార్ వంటివి పొందలేకపోతున్నారు. తద్వారా ప్రాథమిక సౌకర్యా లకు దూరమవుతున్నారు. సమస్యలకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు సంయుక్తంగా ఒక ప్రత్యేకమైన ప్రణాళికలు రూపొందించాలి. ముందుగా సంచార కుటుంబాలకు శాశ్వత నివాస ఏర్పాట్లు చేయాలి. లేదంటే వారు సురక్షితంగా ఉండేందుకు వీలుగా తాత్కాలిక ఆశ్రయ కేంద్రాలు ఏర్పాటు చే యాలి.
ధ్రువీకరణ పత్రాలు అందించాలి. వారి పిల్లల చదువుల కోసం, వారు ఎక్కడికి వెళ్లినా అక్కడి బడుల్లో సులభంగా చే రేందుకు వీలుగా వెసులుబాటుకల్పించాలి. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, వా రి సంప్రదాయ నైపుణ్యాలను గుర్తించాలి. చిన్న వ్యాపారాలు చేసుకునేలా రుణాలు అందించాలి. సామాజిక వివక్షను తొలగించడానికి, వారి చారిత్రక నేపథ్యంపై సామాజిక చైతన్య కార్యక్రమాలు చేపట్టాలి. ఈ పనులన్నీ పర్యవేక్షించేందుకు క్షేత్ర స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించాలి.
వ్యాసకర్త సెల్: 9989988912