calender_icon.png 23 August, 2025 | 11:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికాలో సీఎం రేవంత్‌ రెడ్డికి ఎన్నారైలు ఘనస్వాగతం

04-08-2024 02:15:09 PM

హైదరాబాద్: అమెరికాలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బృందానికి ప్రవాస భారతీయులు ఘనస్వాగతం పలికారు. నేడు న్యూయార్క్‌లో ఎన్‌ఆర్‌ఐలతో సీఎం బృందం సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి 10 రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికా పర్యటన తర్వాత దక్షిణకొరియాలో పర్యటనకు వెళ్లనున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్‌ విదేశీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు కూడా ఈరోజు అమెరికా వెళ్లి ముఖ్యమంత్రిని కలవనున్నారు. ఐటీ, హెల్త్‌కేర్, మాన్యుఫ్యాక్చరింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌తో సహా వివిధ రంగాల్లోని సీఈఓలు, పారిశ్రామికవేత్తలతో సమావేశాల సందర్భంగా రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతుందని పేర్కొంది. న్యూజెర్సీలోని ప్రవాస భారతీయులను కూడా ఆయన కలుసుకుంటారు. వ్యాపార ప్రముఖులతో చర్చిస్తారు.