23-08-2025 11:15:19 PM
కామారెడ్డి కొత్త బస్టాండ్ ఎదుట మహిళల ఆందోళన
కామారెడ్డి,(విజయక్రాంతి): ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం ఎత్తివేయాలని కోరుతూ శనివారం కామారెడ్డి కొత్త బస్టాండ్ ఎదుట మహిళలు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టిసి బస్సులో మహిళలకు టీ బస్సు సౌకర్యం కల్పించడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వెంటనే ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు వచ్చి మహిళలకు నచ్చ చెప్పి ఆందోళనను విరమింప చేశారు.