calender_icon.png 24 August, 2025 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు

23-08-2025 11:22:28 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): బాన్సువాడ మండలంలో బీర్కుర్ చౌరస్తా వద్ద పక్కా సమాచారం మేరకు ఎక్సైజ్ శాఖ పోలీసులు మాటువేసి మహారాష్ట్ర దెగ్లూర్ వాసి అర్జున్ బండారి అనే వ్యక్తి వద్ద 300 గ్రాముల ఎండు గంజాయితో పాటు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సెజ్ సీఐ దిలీప్ తెలిపారు. కామారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ అధికారి సుందర్ సింగ్ తమ సిబ్బందితో పాటు బాన్సువాడ ఎక్సెజ్ సిబ్బంది సంయుక్తంగా దాడి చేసి శనివారం రాత్రి పట్టుకున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ దిలీప్  మాట్లాడుతూ.యువత చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారని గంజాయి కాని ఇతర మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని కోరారు. ప్రభుత్వం మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలపై కఠినంగా వ్యవహరిస్తుందని ఎవరైనా అమ్మిన కొన్న మాకు సమాచారం ఇవ్వాలని వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎక్సైజ్ సి.ఐ.దిలీప్ అన్నారు.