23-08-2025 11:19:08 PM
చౌటుప్పల్,(విజయక్రాంతి): చౌటుప్పల్ మండలంలోని జై కేసారం గ్రామంలోని ఎస్ఆర్ లాబరేటరీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించడంతో పెద్ద ఎత్తున మంటలు రావడంతో అక్కడ చుట్టుపక్కల ఉన్న స్థానికులు ఒక్కసారిగా భయాందోళన గురయ్యారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.