23-08-2025 11:26:15 PM
గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ మల్లు నర్సింహ్మా రెడ్డి
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): పేదల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తూ మెరుగైన వైద్య సేవలను ప్రభుత్వ ఆసుపత్రిలో అందించడం జరుగుతుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, కాంగ్రెస్ నేత మారేపల్లి సురేందర్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ గ్రామీణ మండలానికి చెందిన పలువురికి సిఎంఆర్ఎఫ్ చెక్కులను వారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ5 లక్షల నుంచి 10 లక్షల పెంచిందన్నారు. పేదవారి ఆరోగ్యాన్ని కాపాడేది ప్రజా ప్రభుత్వమే అని ఆయన స్పష్టం చేశారు. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేక పోయినా, ప్రజలకు ఇచ్చే ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపు చేయడం లేదన్నారు.