calender_icon.png 24 August, 2025 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ డిక్లరేషన్ హామీల అమలు కోసం...

23-08-2025 11:07:42 PM

సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డుల పంపిణి

మంచిర్యాల,(విజయక్రాంతి): బీసీ డిక్లరేషన్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కార్డులను పోస్ట్ చేశారు. శని వారం పట్టణంలోని రైల్వే స్టేషన్ దగ్గరలోని ప్రధాన తపాలా కార్యాలయంలో పోస్ట్ కార్డులు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో జరిగిన బీసీ డిక్లరేషన్ సభలో అధికారంలోకి వస్తే స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచి వాటిని ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరణ, మొదటి అసెంబ్లీ సెషన్ లోనే చట్టబద్ధతతో కూడిన మహాత్మా జ్యోతిబాపూలే పేరుతో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు, ప్రభుత్వ సివిల్ కన్ స్ట్రక్షన్ మెయింటనెన్స్ కాంట్రాక్టులలో 42 శాతం రిజర్వేషన్ అమలు, ఐదేండ్లలో బీసీ సంక్షేమానికి లక్ష కోట్ల బడ్జెట్ కేటాయింపు, ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు, తదితర హామీలను ప్రభుత్వం అధికారం చేపట్టి 20 నెలలు అవుతున్న ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బీసీ డిక్లరేషన్ హామీలను తూచా తప్పకుండా వంద శాతం అమలు చేయాలని డిమాండ్ చేశారు.