23-08-2025 11:01:35 PM
నేరుగా వరి విత్తనం విత్తడం ద్వారా కూలీల సమస్యలు అధిగమించవచ్చు
గరిడేపల్లి,(విజయక్రాంతి): వ్యవసాయంలో కలుపు నివారణ కోసం రైతాంగం అవసరమైన జాగ్రత్తలు పాటించాలని అఖిలభారత సమన్వయ కలుపు యాజమాన్య విభాగం ప్రధాన శాస్త్రవేత్త లు డాక్టర్ పద్మజ,డాక్టర్ అంజయ్యలు సూచించారు.మండలంలోని గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో శనివారం నిర్వహించిన వరిలో కలుపు యాజమాన్యాలపై శిక్షణ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. గడ్డిపల్లి కృషి విజ్ఞాన్ కేంద్రం, ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంలోని అఖిలభారత సమన్వయ కలుపు యాజమాన్య విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ... వరి పంటల రెండు నుంచి నాలుగు ఆకులు దశలో ఉన్న సమయంలో కలుపు నివారించుకునే అవకాశం ఉంటుందన్నారు. మూడు నుంచి నాలుగు రకాల కలుపు మందులు పిచికారి చేసినప్పుడు రైతాంగం మోతాదు తగ్గించుకుని వినియోగించాలని సూచించారు. నేరుగా విచ్చే పద్ధతి వరి సాగుపై చేసే రైతులకు వరిలో డ్రమ్స్ సీడర్, వెదజల్లే పద్ధతుల లో డ్రోన్ ద్వారా కలుపు మందును పిచ్చికారి చేసే విధానంపై వారు అవగాహన కల్పించారు.
దీంతోపాటు చీడపీడల సమస్య,నీటి యాజమాన్య పద్ధతులు, కలుపు యాజమాన్య పద్ధతులను రైతులకు వివరించారు. నేరుగా వరి విత్తనం ద్వారా కూలీల సమస్యను అధిగమించవచ్చని తెలిపారు. అనంతరం పార్టీ నియం కలుపు మొక్కను ఎలా నివారించాలో రైతులకు వివరించారు డాక్టర్ కిరణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు సిహెచ్ నరేష్, డి.ఆదర్శ్.పి అక్షిత్, ఏ.నరేష్ తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.