23-08-2025 11:30:30 PM
గ్రంథాలయ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): పేద ప్రజలకు సిఎం రిలీఫ్ ఫండ్ భరోసా ఇస్తుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు హన్వాడ మండలం, మహబూబ్ నగర్ గ్రామీణ మండలానికి చెందిన 32 మంది లబ్దిదారులకు, రూ 13 లక్షల 82 వేల విలువ చేసే సిఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఆర్థిక వ్యవస్థ ను గత ప్రభుత్వం చిన్నాభిన్నం చేసినా ప్రజలకు అందించాల్సిన సంక్షేమ పథకాలకు ఎలాంటి ఆటంకం లేకుండా నిరంతరాయంగా అందజేస్తున్నమన్నారు.