calender_icon.png 24 August, 2025 | 3:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తీర్మానం లేకుండా సొమ్ము స్వాహా...

23-08-2025 11:11:39 PM

లబోదిబోమంటున్న బాధితులు

గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన బాధితులు 

చిలుకూరు: తీర్మానం లేకుండా నగదును స్వాహా చేసిన ఘటన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం కొండాపురంలో చోటుచేసుకుంది. బాధితులు గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. గ్రామానికి ఇందిరా-2 మహిళ సంఘంలో 12 మంది సభ్యులు ఉన్నామని, సంఘం నుంచి ఒక్కొక్కరు 33వేలు అప్పుగా తీసుకున్నట్లు బాధితులు పేర్కొన్నారు. వీబీకే కవిత 33 వేల నగదును 83వేలుగా చూపించి తప్పుడు ప్రాంశరీ నోట్లు తయారు చేసినట్లు ఆరోపించారు.

బ్యాంకుకు వెళ్లి ఆరా తీయగా అసలు విషయం బయటపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు సార్లు ఎలాంటి తీర్మానం లేకుండా పది లక్షలు డ్రా చేసి తమపై అప్పు నెట్టినట్లు ఆరోపించారు. వేలు ముద్ర పెట్టె సభ్యులు సంతకం ఎలా పెడతారని ప్రశ్నించారు. ఫోర్జరీ చేసి తప్పుడు పత్రాలు సృష్టించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేసి వీబీకే కవితపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇదే విషయంపై చిలుకూరు ఏపీఎం వీరబాబును వివరణ అడగగా... బాధితులు రాతపూర్వకంగా కంప్లైంట్ చేశారని, ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని వారి ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.