16-09-2025 07:23:08 PM
త్యాగాలు కమ్యూనిస్టులవి భోగాలు బిజెపివా..?
సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన విరోచిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో విషపురుగులైన కాషాయ ఉన్మాదులకు ఏమిటి సంబంధమని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. త్యాగాలు కమ్యూనిస్టులవి భోగాలు బిజెపివా అని ప్రశ్నించారు. 1946 సెప్టెంబర్ 11 నుండి 1951 సెప్టెంబర్ 17 వరకు జరిగిన విరోచిత వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మచ్చుకైనా కనిపించని మతోన్మాదులు ఆ పోరాటానికి వారసులమంటూ సభలు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు.
సెప్టెంబర్ 17 ను తెలంగాణ సాయుధ పోరాట దినోత్సవంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రంలోని సుభాష్ విగ్రహం వద్ద బహిరంగ సభ నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కరత్ హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నారి ఐలయ్య, పాలడుగు నాగార్జున, చిన్న పాక లక్ష్మీనారాయణ, పాల్గొన్నారు.