01-12-2024 10:04:46 AM
విద్యార్థినీల చెంపపలకొట్టిన వాచ్మెన్
అర్ధరాత్రి 10:30 వరకు ఆందోళన
భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని ఎస్సీ హాస్టల్లో శనివారం రాత్రి దారణం చోటుచేసుకుంది. విద్యార్థినిలు క్యారెట్ తిన్న పాపానికి వాచ్మెన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థులపై చేతులతో, కర్రలతో దాడిగా పాల్పడిన సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే కొత్తగూడెంలోని ఎస్సీ బాలికల పోస్ట్మెట్రిక్ వసతి గృహంలో విద్యార్థినిలు క్యారెట్లు తిన్నారు. దీంతో భవ్య, పావని, నిరోషాలను వాచ్మెన్ చంపల వాయగొట్టి వారితో కర్రలతో దాడి చేసిందని విద్యార్థులు ఆరోపించారు. హాస్టల్లో ఉంటున్న విద్యార్థినులు హాస్టల్ గేటు ఎదుట ధర్నాకు దిగారు. గత మూడు నెలల నుంచి భోజనం బాగాలేదని పత్రికల్లో వార్తలు వచ్చినప్పటి నుంచి తమపై వేధింపులు ఎక్కువయ్యాయని విద్యార్థులు ఫిర్యాదు చేస్తున్నారు.
కొందరు విద్యార్థినేలను టార్గెట్ చేసుకొని వారిపై వేధింపులకు పాల్పడుతున్నారని, దీని వెనక ఓ అధికారి ఉండి సిబ్బందిని ఉసిగొల్పుతున్నట్లు వాళ్లు ఆరోపిస్తున్నారు. విద్యార్థులను కొట్టడం ఏంటనే తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సదర్ వాచ్మెన్ తమపై పలుమార్లు దాడి చేసిందని ఇది హాస్టలా లేకపోతే జైలా అని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంత జరుగుతున్న పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్ పై, తమపై దాడికి పాల్పడిన వాచ్మెన్ పై చర్యలు తీసుకోవాలని విద్యార్థినిలు డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు బ్లాక్మెయిల్ చేసుకుంటూ, హాస్టల్ నిర్వహణ సక్రమంగా చేయడం లేదని వారు ఆరోపిస్తున్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి ఇలాంటి వారిపై పూర్తిస్థాయిలో విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.