01-12-2024 04:01:32 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 30 (విజయక్రాంతి): సమగ్ర సస్యరక్షణ పద్ధతుల (ఐపీఎం) ద్వారా పురుగు మందుల వాడకాన్ని తగ్గించి ఎక్కువ దిగుబడిని పెంచడంపై కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో అబాది జమ్మికుంటలో రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ అనుకూల పద్ధతులను అవలంబించడమే లక్ష్యంగా మల్లారెడ్డి విశ్వవిద్యాలయం (వ్యవసాయ విద్యార్థులు) 3 నెలల రూరల్ అవేర్‌నెస్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ప్రోగ్రామ్ నిర్వహించింది.
ఈ సందర్భంగా కౌన్సిలర్లు అశోక్, దయ్యాల శ్రీనివాస్, బోగం సుగుణ, ఎగిత రవీందర్, మహేందర్ రైతులతో మాట్లాడుతూ పంట మార్పిడి, లోతుగా దున్నడం, అంతర పంటలు, ట్రాప్ పంట, లింగాకర్శక బుట్టలు, జిగురు ఆకర్షక అట్టలు, పాన్ ట్రాప్స్ పండు, ఈగ ఫెరోమోన్ ట్రాప్స్, దీపపు ఎరలు, విషపు ఎరలు వంటి పర్యావరణ పద్ధతుల గురించి రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్ర మంలో కొమురయ్య, సమ్మయ్య, భిక్షపతి, ధర్మేందర్, బత్తుల వెంకటమ్మ పాల్గొన్నారు.