calender_icon.png 29 August, 2025 | 12:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జలమండలి ఉద్యోగుల ఓటి బకాయిలు, పరిహారం రూ.5 కోట్లు విడుదల

29-08-2025 05:14:10 AM

  1. పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్
  2. కృతజ్ఞతలు తెలిపిన ఐఎన్టీయూసీ, హెచ్ ఎండబ్ల్యుఎస్‌ఎస్బి ట్రేడ్ యూనియన్ జేఏసీ అధ్యక్షుడు మొగుళ్ల రాజిరెడ్డి

ముషీరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి) : దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న  ఉద్యోగుల ఓటి బకాయిలు, పరిహారం 5 కోట్ల రూపాయలు  జలమండలి యాజమా న్యం విడుదల చేసిందని ఐఎన్టీయూసీ హెచ్ ఎండబ్లుఎస్‌ఎస్‌బి ట్రేడ్ యూనియన్స్ జా యింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు మొ గుళ్ల రాజిరెడ్డి తెలిపారు.

జలమండలి కార్యాలయంలో గురువారం  జలమండలి డైరెక్టర్ (ఫైనాన్స్) పద్మావతి ఈ మేరకు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సమక్షంలో 5 కోట్ల రూపాయల సర్కులర్ పత్రా న్ని రాజిరెడ్డికి అందజేశారు. ఈ సందర్బంగా మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పాటుపడుతుందని, ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటాన్నారని అన్నారు. కార్యక్రమంలో రాఘ వేంద్ర రాజు, అల్లి శ్రవాన్ కుమార్, దేవేందర్, అక్తర్ అలీ, తదితరులు పాల్గొన్నారు.