03-01-2026 12:00:00 AM
చండూరు, జనవరి 2 (విజయ క్రాంతి): చండూరు మండల పరిధిలోనినేర్మట గ్రామంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈ వాటర్ ప్లాంట్ ను గ్రామ సర్పంచ్ నందికొండ వసంత ధనయ్య, గ్రామ ఉపసర్పంచ్ నందికొండ మమత వెంకట రమణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రజల నమ్మకంతో తమను గ్రామ సర్పంచ్ గా, ఉప సర్పంచ్ గా గెలిపించారన్నారు.
పార్టీలకతీతంగా నేర్మట గ్రామ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటామని వారు అన్నారు. బూర నర్సయ్య గౌడ్ ఎంపీగా ఉన్నప్పుడు ఈ వాటర్ ప్లాంట్ ను ఎంపీ నిధుల నుండి నిర్మించారని, కానీ కొన్ని కారణాల వలన ఈ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించలేదని కానీ ప్రజల హామీ మేరకు ఈ వాటర్ ప్లాంట్ నుప్రారంభించడం జరిగిందని వారు తెలిపారు. ప్రజల నమ్మకాన్నివమ్ము చేయకుండా ప్రజా సమస్యలే పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. గ్రామంలోని ఏ వార్డులోనైనా ఎలాంటి సమస్యలు ఉన్న గ్రామపంచాయతీ దృష్టికి తీసుకురావాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అనంతరం గ్రామ ప్రజలు ఈ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించడంతో గ్రామ సర్పంచ్ కు, ఉప సర్పంచ్ కు, వార్డు మెంబర్లకుప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నందికొండ వెంకటరెడ్డి, గాలెంక కృష్ణయ్య, రమణారెడ్డి, ప్రవీణ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, దశరథ, వార్డు మెంబర్లు నారపాక దశరథ, జెర్రిపోతుల ధనంజయ, బండమీది వెంకటయ్య, బురుకల రాజు, బుర్కల వసంత సైదులు, రాజు,ఓర్సు రోహిని, బల్లెం కవిత స్వామి, దోమల బిక్షమయ్య, ఈరటి సైదులు తదితరులు పాల్గొన్నారు.