calender_icon.png 8 January, 2026 | 7:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాలుగు రోజులు విద్యుత్ అంతరాయం

03-01-2026 12:00:00 AM

అశ్వారావుపేట, జనవరి 2(విజయ క్రాంతి) : రోడ్డు విస్తరణ పనులలో భాగంగా కొత్త కరెంటు టవర్స్ పై 33కెవి, 11కేవీ, LT విద్యుత్ తీగలు వేయడం జరిగినది. రోడ్డు కి ఇరువైపులా ఉన్న  పాత స్తంభాలు తీగలు తీసివేయడం  జరుగుతుంది కావున విద్యుత్ సరఫరా లో అంతరాయం కలుగుతుందని వినియోగదారులు సహకరించాలని విద్యుత్ అధికారులు కోరారు. 

శనివారం నుండి మంగళవారం  అనగా 3వ తేదీ నుండి 6వ తేదీ వరకు వినాయకపురం రోడ్ (పోలీస్ స్టేషన్ నుండి పెద్ద రైస్ మిల్), ఓల్ ఆంధ్రాబ్యాంక్ వీధి, దండబత్తుల బజార్, గాంధీ బొమ్మ సెంటర్,ముస్లిం బజార్,దూదేకుల బజార్, చిన్నంశెట్టి బజార్, తూర్పు బజార్, వడ్డెర బజార్, అంబేద్కర్ నగర్, గౌడ బజార్, తిరుమల నగర్, శివయ్య గారి బజార్,  గుర్రాల చెరువు రోడ్, రామాలయం బజార్, కొనరు బజార్ మరియు పెట్టామలపల్లి ప్రాంతాల్లో  ఉదయం 9గం నుండి మధ్యాహ్నం 3గం వరకు విద్యుత్ అంతరాయము కలుగుతుందని విద్యుత్ అధికారులు తెలిపారు.