calender_icon.png 5 July, 2025 | 8:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగార్జునసాగర్ ఎడమకాల్వకు నీరు విడుదల

05-07-2025 01:23:49 AM

నాగార్జునసాగర్, జూలై 4: ఖమ్మం జిల్లాలో నెలకొని ఉన్న తాగునీటి అవసరాల కొరకు పాలేరు రిజర్వాయర్ కు నాగార్జునసాగర్ డ్యాం నుంచి ఎడమ కాల్వకు శుక్రవారం ఎన్‌ఎస్ అధికారులు 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎడమకాల్వ హెడ్ రెగ్యులేటర్ వద్ద గల గేట్ ను ఎన్‌ఎస్పీ అసిస్టెంట్ ఇంజనీర్లు కృష్ణయ్య, విజయ్ కుమార్ లు స్విచ్ ఆన్ చేసి కాల్వలోకి విడుదల చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో నెలకొని ఉన్న తాగునీటి అవసరాల మేరకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సాగర్ ఎడమ కాల్వ నుంచి 3 వేల క్యూసెక్కుల నీటిని సుమారు 4 రోజుల పాటు విడుదల చేస్తున్నామన్నారు.