calender_icon.png 30 July, 2025 | 8:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విరిసిన విద్యా కుసుమం

24-07-2025 12:00:00 AM

గిరిజన బిడ్డకు ఢిల్లీ యూనివర్సిటీలో సీటు. 

ఐఏఎస్ కావాలనేది నా లక్ష్యం

అశ్వాపురం, జులై 23 (విజయ క్రాంతి); తమ పిల్లలు తమలాగే వ్యవసాయ కూలీలు కాకూడదని, విద్యారంగంలో రాణించి అందరికీ ఆదర్శంగా నిలవాలని,కాయ కష్టం చేసిచదివించిన ఓ గిరిజన తల్లిదండ్రుల కలను సాకారం చేసింది హరిణి. ఆమె గిరిజన పుత్రిక..అత్యంత ప్రతిష్టాత్మకమైన సెం ట్రల్ యూనివర్సిటీలో ఒకటైన ఢిల్లీలోని డాక్టర్ బి.ఆర్ సెం ట్రల్ యూనివర్సిటీలో ఎం ఏ ఆర్టియాలజీలో సీటు సాధించి అందరికీ ప్రేరణగా నిలిచింది.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని మారుమూల గ్రామ మైన వెంకటా పురానికి చెందిన సోయం హరిణి. హైదరాబాద్ మేడ్చల్ లోని ఓ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో డిగ్రీ , ఇటీవల పూర్తి చేశారు.

దేశ రాజధాని ఢిల్లీలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆర్కియాలజీలో సీటు సా ధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. హరిణి చిన్నప్పటినుండే సరస్వతీ పుత్రిక. తన చదువుల్లో అత్యుత్తమ ప్రతిభ చూపేది. హరిణి తల్లి స్వప్న గృహిణి , తండ్రి శ్రీనివాస్ వ్యవసాయ కూలీలే .అయినప్పటికీ వారిద్దరికీ చదువుపై ఉన్న ఇష్టాన్ని కాదనలేక , ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న ఇద్దరి కుమార్తెలను కూడా చదువుకునేందుకు ప్రోత్సహించేవారు. హరిణి పెద్ద కుమార్తె , చెల్లెలు సంతోషిని బి.ఎ తృతీయ సంవత్సరం ఇబ్రహీంపట్నం హైదరాబాద్ లోని సంక్షేమ గురుకుల కళాశాలలో చదువుతున్నది.

హరిణి పదో తరగతి వరకు భద్రాచలంలోని గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో విద్యను అభ్యసించింది అనంతరం ఇంటర్మీడియట్ హెచ్‌ఈసి గ్రూపు భద్రాచలం గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో అభ్యసించారు. తెలంగాణ గురుకులం అండర్ గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ -2022 లో ... హరిణి తెలంగాణ రాష్ట్ర నెంబర్ వన్ ర్యాంకు సాధించింది. అదే పట్టుదల నమ్మకంతో హైదరాబాద్ మేడ్చల్ లోని ఓ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో డిగ్రీ ఇటీవల పూర్తి చేసి, దేశ రాజధాని లోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీ అయినటువంటి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎం.ఏ ఆర్కియాలజీలో సీటు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. 

ఐఏఎస్ కావాలన్నదే లక్ష్యం

ఐఏఎస్ కావాలనేది తన లక్ష్యం అంటుంది చదువుల సరస్వతి హరిణి . ఈ విషయం తెలుసుకున్న హరిణి కి అటు కాలే జీ అధ్యాపకులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు, నాయకులు ,అ ధికారులు, శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.