02-12-2025 03:07:43 PM
చిట్యాల,(విజయక్రాంతి): రామన్నపేట సిరిపురం మధ్యలో ఉన్న రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ దగ్గర వర్షాలు వెలిసి 20 రోజులు అవుతున్న నీరు నిల్వ ఉండి ప్రయాణకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయంలో రైల్వే అధికారులు వెంటనే చొరవ తీసుకొని పరిష్కార మార్గం చూపాలని, తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాపోలు నరసింహ అన్నారు. సముద్రాలపై రైల్వే ట్రాక్ లను నిర్మాణం చేసి రైల్వే వ్యవస్థను పటిష్టంగా తయారు చేసినటువంటి అధికారులు ఇక్కడ ఉన్న చిన్న సమస్యను పరిష్కారం చేసి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడకపోవడం విచారకరమైన విషయం అని అన్నారు.
ఇక్కడ ప్రతినిత్యం వెహికల్స్ లోకి సైలెన్సర్ లోకి నీరు పోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ విషయంలో రైల్వే అధికారులు ప్రత్యేకమైన చొరవ చూపాలని అన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇట్టి విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకుపోయినా కానీ పరిష్కారం చూపకపోవడం విచారకరమని, వెంటనే పరిష్కార మార్గం చూపి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోషిక చక్రపాణి, గంజి సత్యనారాయణ, కంకల మల్లేశం, నిమ్మల మధు, బడుగు రమేష్, తదితరులు పాల్గొన్నారు.