calender_icon.png 14 August, 2025 | 7:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిశుభ్రతతోనే ప్రజారోగ్యం

14-08-2025 06:51:01 PM

శ్రమదానం చేసిన ప్రభుత్వ విప్...

మహబూబాబాద్ (విజయక్రాంతి): పరిసరాల పరిశుభ్రతతో ప్రజారోగ్యం మెరుగవుతుందని, ప్రతి ఒక్కరూ పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్(MLA Dr. Jatoth Ramachandru Naik) పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఆవరణలో గురువారం శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన స్వయంగా చీపురుతో పరిసరాలను శుభ్రం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సేవ, గ్రామాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యం ఇస్తోందని, గ్రామాలు పరిశుభ్రంగా, పచ్చగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను గుర్తించి ముందుకు రావాలని, పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత కాదని మనందరి కర్తవ్యమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.