10-08-2025 12:58:31 AM
వేతనాల పెంపునకు సంబంధించి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గత కొద్ది రోజుగా ఫిలిం ఫెడరేషన్ సభ్యులు, నిర్మాతలకు మధ్య పెద్ద వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ పెద్ద వివాదంలో చిరు వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఓ ప్రకటన ఇవ్వడం సంచలనంగా మారింది.
ఈ వార్తలపై తాజాగా శనివారం చిరంజీవి ఎక్స్ ద్వారా స్పందించాడు. కార్మికుల వేతనాల పెంపు ఇండస్ట్రీకి సంబంధించిన సమస్య అని. ఈ విషయంలో ఏకపక్షంగా ఎవరూ నిర్ణయం తీసుకోలేరన్నాడు చిరంజీవి. 30 శాతం వేతనాల పెంపునకు తాను అంగీకరించానని.. షూటింగ్ ప్రారంభిస్తానని దుష్ప్రచారం చేస్తున్నారు.
ఫెడరేషన్‌కు చెందిన ఎవరినీ నేను కలవలేదు. నాపై తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నానన్నారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అత్యున్నత సంస్థ ఫిల్మ్ ఛాంబర్. ఫిల్మ్ ఛాంబర్ మాత్రమే సమిష్టిగా సంబంధిత సభ్యులందరితో చర్చలు జరిపి వారి కోసం న్యాయమైన పరిష్కారాన్ని కనుగొంటుంది. అప్పటి వరకు నిరాధారమైన తప్పుడు వాదనలు చేయడం ఆమోదయోగ్యం కాదు. ఇలాంటి ప్రేరేపతి వాదలన్నింటిని ఖండిస్తున్నా. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరని ఎక్స్ వేదికగా చిరంజీవి ట్వీట్ చేశాడు.