31-01-2026 07:17:02 PM
జాతర కమిటీ చైర్మన్ పొన్నం చంద్రయ్య గౌడ్
సుల్తానాబాద్,(విజయక్రాంతి): వనదేవతలను దాదాపు ఆరు లక్షల మంది భక్తులు దర్శించుకోవడం జరిగిందని జాతర కమిటీ చైర్మన్ పొన్నం చంద్రయ్య గౌడ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల మానేటి రంగనాయక స్వామి ఆలయ ఆవరణలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాల్లో భాగంగా శనివారం కూడా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా జాతర కమిటీ చైర్మన్ పొన్నం చంద్రయ్య గౌడ్ మాట్లాడుతూ... గత మూడు రోజుల నుంచి జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా హాజరు కావడం జరిగింది అన్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాతర కమిటీ, ఆలయ కమిటీ, గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటులను ముమ్మరంగా చేయడం జరిగిందన్నారు. భక్తులు తల్లులను దర్శించుకునేందుకు క్యూ లైన్ ద్వారా మొక్కులు చెల్లించుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. ఏ లాంటి అవాంఛనీయమైన సంఘటన జరగకుండా సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ చంద్రకుమార్ ల ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. జాతర విజయవంతం కు కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా చైర్మన్ చంద్రయ్య గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.