31-01-2026 08:24:58 PM
సిద్దిపేట క్రైం: ప్రజల పక్షాన నిలబడి, ప్రజా పోరాటాలకు అండగా నినదించడమే గద్దర్ కు మనమిచ్చే నివాళులని జేఏసీ నేత, రిటైర్డ్ ప్రిన్సిపాల్ జి.పాపయ్య అన్నారు. ప్రజాయుద్ధనౌక గద్దర్ 78వ జయంతి సందర్భంగా సిద్దిపేటలోని పొన్నాల వై జంక్షన్ వద్ద ఆయన విగ్రహ ప్రతిపాదిత స్థలంలో చిత్రపటానికి పూలమాలలు వేసి పలు దళిత, బహుజన, ప్రజాసంఘాల నేతలు నివాళులర్పించి ప్రసంగించారు.
విగ్రహ నిర్మాణ కమిటీ చైర్మన్ పోచబోయిన శ్రీహరి యాదవ్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం మూడు ఎకరాల్లో స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. కో చైర్మన్ ఆస లక్ష్మణ్ మాట్లాడుతూ... సిద్దిపేటలో త్వరలోనే అన్ని దళిత, బహుజన, ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా సంఘాల సహకారంతో గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుందామన్నారు.
కార్యక్రమంలో టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి విక్రమ్ రెడ్డి, మంజీరా రచయితల సంఘం నాయకులు సిద్ధంకి యాదగిరి, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నాయకులు బత్తుల చంద్రం, దర్పల్లి శ్రీనివాసు, గ్యాదరి జగన్, మేరుగు మహేష్, పయ్యావుల రాములు, ఎద్దు యాదగిరి, కోరే ఎల్లయ్య, బోయ రాములు, చింతల కుమార్, యాద నరేందర్ కోత్వాల్, భూంపల్లి శ్రీహరి కౌన్సిలర్, ఆకుల ప్రశాంత్, పోతుల మోహన్, పాతుకుల వెంకటేశం, శాతరాజు ఆంజనేయులు, కుంభాల ఎల్లారెడ్డి, డీబీఎఫ్ నేత మెట్ల శంకర్, పడిగె ప్రశాంత్, సంతోష్ గౌడ్, తరిగొప్పుల రామచంద్రం, ఆసబాబు అక్బర్, దెబ్బేట ఆనంద్ తోపాటు స్థానిక సర్పంచ్అమ్ముల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో బహుజన సాహితీవేత్త భీమసేన గద్దర్ పాటలతో అందరిలో స్ఫూర్తినింపారు.