calender_icon.png 31 January, 2026 | 10:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాల రక్షా భవన్‌ను తనిఖీ చేసిన జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ యువరాజా

31-01-2026 08:32:58 PM

కుమ్రంభీం  ఆసిఫాబాద్(విజయక్రాంతి): జిల్లాలోని బాల రక్షా భవన్‌ను శుక్రవారం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ శ్రీ యువరాజా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో బాలల సంరక్షణ కోసం చేపడుతున్న కార్యక్రమాలపై డీసీపీఓ మహేష్‌ను అడిగి తెలుసుకున్నారు. పోక్సో కేసులకు సంబంధించి బాధితులకు అందజేస్తున్న పరిహారం (కాంపెన్సేషన్) వివరాలు, జువెనైల్ కేసుల నిర్వహణపై సమగ్రంగా పరిశీలించారు. జిల్లాలో బాలల రక్షణ, బాల్య వివాహాల నిర్మూలన, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం సంబంధిత అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని సూచించారు.