calender_icon.png 31 January, 2026 | 9:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాగజ్‌నగర్ మున్సిపల్ పై భాజపా జెండా ఎగురవేస్తాం

31-01-2026 08:30:28 PM

ఎంపీ గోడం నగేష్

కాగజ్‌నగర్(విజయక్రాంతి): పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో శుక్రవారం భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులతో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్  మాట్లాడుతూ... కాగజ్‌నగర్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో భాజపా జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థలు కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు.

కాగజ్‌నగర్ పట్టణానికి నూతన శాఖ గ్రంథాలయ భవన నిర్మాణానికి ఎంపీ ల్యాండ్ నిధుల నుంచి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సిర్పూర్ శాసనసభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ పట్టణంలో డ్రైనేజీ, రహదారులు, పారిశుధ్య అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.అనంతరం భాజపా కరపత్రాలు, డోర్ పోస్టర్లను విడుదల చేసి కౌన్సిలర్ అభ్యర్థులను పరిచయం చేశారు.