calender_icon.png 31 January, 2026 | 8:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల తనిఖీలో చెక్‌పోస్టు రెండు కిలోల వెండి స్వాధీనం

31-01-2026 07:13:20 PM

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): సిరిసిల్లలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం రగుడు వద్ద ఏర్పాటు చేసిన ఎస్ఎస్టి చెక్‌పోస్టులో వాహన తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా TS08FS6726 నంబర్ గల కారును పోలీసులు ఆపి పరిశీలించగా కారులో లెక్కలలో లేని అనుమానాస్పదమైన 2.342 కిలోల వెండి పట్టగోలుసులు ఉన్నట్లు గుర్తించారు. కార్ డ్రైవర్‌గా ఉన్న తోగిటి సత్యానారాయణ తండ్రి వెంకట్రాములు మెట్పల్లి గ్రామం, జగిత్యాల జిల్లా నివాసిగా పోలీసులు గుర్తించారు.

ఎన్నికల నిబంధనల మేరకు ఎస్ఎస్టి బృంద ఇన్‌చార్జ్ జి. ఆనంద్, ఏపీవో సమక్షంలో మధ్యవర్తుల పంచనామా సాక్షుల ఎదుట వెండి పట్టగోలుసులను స్వాధీనం చేసుకున్నారు. వీటి మూలం, ఉపయోగ ఉద్దేశ్యం గురించి తెలుసుకునేందుకు తదుపరి విచారణ కొనసాగుతోందని సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ కే. కృష్ణ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రలోభపెట్టే ఉద్దేశంతో డబ్బులు, మద్యం లేదా విలువైన వస్తువులు తరలిస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆయన కోరారు.ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.