31-01-2026 08:27:09 PM
కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి
సిద్దిపేట క్రైం: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసమే పనిచేస్తోందని కిసాన్ కాంగ్రెస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి అన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన కార్యక్రమంలో రెడ్డి మహేందర్ రెడ్డిని కిసాన్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర కో కన్వీనర్ నాయిని నరసింహారెడ్డి తో కలిసి నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల సబ్సిడీలు ప్రవేశపెట్టి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందన్నారు.
గత సంవత్సరం మాదిరిగా ఈ యేడు యూరియా కోసం తిప్పలు ఉండవన్నారు. రైతులు ఇంటి నుంచే మొబైల్ ద్వారా యూరియా బుక్ చేసుకునే విధంగా ప్రభుత్వం కార్యచరణ రూపొందించిందని చెప్పారు. రైతులు ఎక్కడైనా సమస్యలు ఎదుర్కొన్నట్టయితే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ నాయకులు మహిపాల్ రెడ్డి, వెంకటేశం పలువురు పాల్గొన్నారు.