31-01-2026 08:18:58 PM
కళాశాల చైర్మన్ డాక్టర్ నీలా సత్యనారాయణ
కోదాడ,(విజయక్రాంతి): సీనియర్ విద్యార్థినులు జూనియర్ విద్యార్థినులకు మార్గదర్శకంగా నిలవాలని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ డాక్టర్ నీలా సత్యనారాయణ అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో డిప్లమా ప్రథమ సంవత్సరం విద్యార్థినులకు నిర్వహించిన స్వాగత వేడుకలు, తృతీయ సంవత్సరం విద్యార్థినులకు వీడ్కోలు వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
కళాశాల స్థాపించిన నాటి నుంచి నేటి వరకు వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యలు పూర్తి చేసి దేశ విదేశాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో స్థిరపడ్డారని తెలిపారు. విద్యార్థినులు తమ ముందున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని భవిష్యత్తును బలంగా తీర్చిదిద్దుకోవాలి. ముఖ్యంగా డిప్లమా ఫైనల్ ఇయర్ విద్యార్థినులు మరింత ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయాలి అని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళపల్లి గాంధీ, అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ నాగార్జున రావు, విభాగాధిపతులు రమేష్, నరేష్ రెడ్డి, స్రవంతి, శివాజీ, లక్ష్మణ్, అధ్యాపక సిబ్బంది లావణ్య తదితరులు పాల్గొన్నారు.