calender_icon.png 25 December, 2025 | 12:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాభివృద్ధికి నడుం కట్టాలి!

23-12-2025 12:00:00 AM

కొండేటి ప్రకాష్ :

తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోలాహలం ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోనూ ‘ఎప్పుడెప్పుడు ఎన్నికలు వ స్తాయా.. ఎప్పుడు గ్రామాలకు కొత్త పాలకులు వస్తారా?’ అని ఎదురుచూసిన తరు ణం కూడా ముగిసిపోయింది. వాస్తవానికి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కేటాయింపు అంశంపై నెలకొన్న సందిగ్ధత వల్ల ప్ర భుత్వం కొన్ని నెలల పాటు గ్రామ పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాల్సి వ చ్చింది.

కానీ హైకోర్టు తీర్పుతో అనూహ్యంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రామ పంచాయతీ ఎన్నికలకు నగారా మోగించింది. ఆపై నోటిఫికేషన్ ఇవ్వడం.. మూ డు విడతలుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించి ఆ ప్రక్రియకు ముగింపు పలికింది. తాజాగా సోమవారం రాష్ట్రంలోని అన్ని గ్రామల్లోనూ కొత్త సర్పంచ్‌లు, పాలక వ ర్గం బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని పల్లెల్లో పండగ వాతావరణం కనిపిస్తోంది.

అయితే గెలిచిన సర్పం చ్‌లకు ఇది కేవలం విజయోత్సాహం మా త్రమే కాదు, ఒక పెద్ద పరీక్షా కాలం ప్రారంభమైందని చెప్పొచ్చు. సర్పంచ్‌గా గెలిచిన సంతోషం కొద్దిరోజులే ఉంటుంది, కానీ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే మాత్రం ఇప్పటి నుంచి ఐదేళ్ల పాటు నిరంతరం గ్రామాభివృద్ధికి కష్టపడాల్సిందే.

పాలనతో గౌరవం!

అయితే, ఈ విజయం వెనుక ఉన్న చే దు నిజాలను కూడా మనం విస్మరించ లేం. ఎవరు ఔనన్నా, కాదన్నా.. ఈ ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ జరిగింది. ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థులు ఓటర్లను పిలిపించి దేవుళ్ల ఫొటోల మీద ప్రమాణాలు చేయించుకుంటున్న దృశ్యాలు టీవీల్లో, సామాజిక మాధ్యమాల్లో మనం చూశాం. ఇవన్నీ ప్రజాస్వా మ్యానికి కొంత కలత కలిగించే అంశాలే అయినప్పటికీ, ప్రజల మద్దతుతో విజ యం సాధించిన సర్పంచ్‌లు ఇప్పుడు సమగ్ర గ్రామాభివృద్ధి కోసం ప్రత్యేకమైన వారుగా పేరు సంపాదించుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

ఈ సందర్భంగా ఒక సామాన్య పౌరుడిగా, గ్రామాభివృద్ధిని కోరుకునే వ్యక్తిగా కొత్త సర్పంచ్‌లకు పాల నా పరంగా కొన్ని కీలక సూచనలు ఇప్పు డు అవసరం. ఎన్నికల సమయంలో గ్రా మాల్లో వర్గ పోరు అనేది సహజం. కానీ అది ఎన్నికల వరకే పరిమితం అని గుర్తుంచుకోవాలి. ఒక్కసారి గెలిచిన అభ్యర్థి అనే వాడు కేవలం ఓటు వేసి గెలిపించిన వారికి మాత్రమే సర్పంచ్ కాడు.. ఓటు వే యని వారికి, వ్యతిరేకించిన వారికి కూడా తానే సర్పంచ్ అన్న విషయం గుర్తుంచుకోవాలి.

‘వీడు మనకు ఓటు వేయలేదు, వీడికి ఏ పని చేయొద్దు‘ అనే ధోరణిలో ఉంటే గ్రామం ఎప్పటికీ బాగుపడదు. కుల, మత భేదాలను గ్రామాల నుంచి తరిమివేయడానికి ఆయా గ్రామ సర్పంచ్‌లు కంకణబద్ధులు కావాలి. పాత గొడవలను పక్కన పెట్టి, అందరినీ కలుపుకొని పోయేవాడే నిజమైన నాయకుడు. ఆ పెద్దరికాన్ని గ్రామ సర్పంచ్‌లుగా గెలిచిన అభ్యర్థులు ప్రదర్శించాలి. గ్రామ పంచాయతీ అభివృ ద్ధి కోసం మీరు ప్రత్యేకమైన ప్రణాళికలు రూపొందించుకోవాలి. గ్రామంలో పెద్ద పెద్ద ప్రాజెక్టుల కంటే, నిత్యం ప్రజలు పడే ఇబ్బందులపై దృష్టి పెట్టాలి.

వీధి దీపాలు వెలుగుతున్నాయా? డ్రైనేజీలు సక్రమంగా ఉన్నాయా? కుళాయిల్లో నీరు వస్తుందా? అనేవి చిన్న విషయాలుగా అనిపించవచ్చు కానీ గ్రామాల్లోని సాధారణ ప్రజలకు ఇవే ముఖ్యమైనవి. మురికి కాలువలు దగ్గరుం డి శుభ్రం చేయించడం, వీధుల్లో చెత్త పేరుకుపోకుండా చూడటం వంటి పనులు స ర్పంచ్‌ల పాలనపై ప్రజల్లో గౌరవాన్ని పెం చుతాయి. గ్రామ పరిశుభ్రత, ప్రజల ఆరోగ్యం విషయంలో ఎక్కడా రాజీ పడకూడదు.

అవినీతికి తావు లేకుండా..

గ్రామ పంచాయతీకి వచ్చే నిధులెంత? ఖర్చు పెడుతున్నదెంత? అనే విషయాల ను సామాన్య ప్రజలకు తెలిసేలా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నోటీసు బోర్డుల్లో ప్రదర్శనగా ఉంచాలి. గ్రామ పం చాయతీ అభివృద్ధి కార్యక్రమంలో ప్రజలు పాల్గొనే విధంగా వారిని ప్రోత్సహించాలి. గ్రామసభలను తూతూమంత్రంగా కాకుం డా, పక్కాగా నిర్వహించాలి. ప్రజలకు వీలు న్న సమయంలోనే సభలు నిర్వహించి, కనీసం మూడింతల మంది ప్రజలు పా ల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలి.

ప్రతి పైసా ప్రజల సొమ్ము అనే స్పృహ ఉన్నప్పుడు, అవినీతికి తావు ఉండకూడదు. గ్రామంలో చేసే పనుల వివరాలను నోటీ సు బోర్డులపై ఉంచడం ద్వారా ప్రజల్లో గ్రామపెద్ద పాలనపై నమ్మకం పెరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు ఎలా చదువుతున్నారు? అంగన్వాడీల్లో చిన్న పిల్లలకు పౌష్టికాహారం అందుతుందా? లేదా అనేది వారానికోసారి స్వయంగా పర్యవేక్షించాలి. గ్రామాభివృద్ధి అనేది ము ఖ్యంగా విద్య, వైద్యంతో ముడిపడి ఉంటుందన్న విషయం మరువకూడదు.

గ్రామీణ విద్యార్థుల కోసం ప్రభుత్వ బడు ల్లో గ్రంథాలయాల స్థాపన (Libraries) ఏర్పాటు చేసేలా ఆయా అధికారులతో సంప్రదింపులు జరిపి గ్రంథాలయాల స్థాపనకు నడుం కట్టాలి. అం తేగాక గ్రామాల్లో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని మందులు అందుబాటు లో ఉన్నాయా, డాక్టర్లు సమయానికి వస్తున్నారా అనేది చూడాలి. గ్రామంలో యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా, వారికి క్రీడల పట్ల ఆసక్తి కలిగించేలా మైదానాలను అభివృద్ధి చేయాలి.

ఆదర్శ పాలన..

సర్పంచ్ పదవి అనేది ఒక హోదా కా దు, అది ప్రజలకు సేవ చేసే ఒక గొప్ప అవకాశం. ఫలితాల రోజున మెడలో పడిన పూలదండలు కేవలం విజయోత్సవానికి చిహ్నాలు మాత్రమే కాదు, అవి ప్రజలు మీపై ఉంచిన నమ్మకానికి నిదర్శనం. రాజకీయ పార్టీలు, నాయకులు గ్రా మాభివృద్ధికి ఆటంకంగా మారకూడదు. ఐదేళ్ల తర్వాత ఒక గ్రామ సర్పంచ్ పదవి నుంచి దిగిపోతున్నప్పుడు, ‘మా ఊరి సర్పంచ్ మంచి పనిచేసిండు‘ అని ప్రజలు చెప్పుకున్నారంటే అది ఆయా వ్యక్తి సాధించుకున్న ఒక గొప్ప ఆస్తి.

రాజకీయాలను తాత్కాలికంగా చూడండి, అభివృద్ధిని శాశ్వతంగా చూడండి. గ్రామాన్ని ఆదర్శంగా మార్చుకునే గొప్ప అవకాశం  కొత్తగా ఎన్నికైన సర్పంచ్ చేతుల్లోనే ఉంటుంది. ఈ చారిత్రక అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, గ్రామ స్వరాజ్య స్థాపనలో విజేతలుగా, ప్రజాసేవకు పునరంకితం కావాల్సిన అవసరముంది.

 వ్యాసకర్త సెల్: 79817 81086