14-09-2025 06:28:50 PM
కాంగ్రెస్ పార్టీ కార్మిక వర్గానికి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలి
సీఐటీయు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ
చండూరు,(విజయక్రాంతి): కేంద్రంలో 3 వసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దుచేసి 4 లేబర్ కోడ్స్ తెచ్చి కార్మికులను ఆధునిక బానిసలుగా మార్చే విధానంపై సమరశీల ఉద్యమాలకు కార్మిక వర్గం సిద్ధం కావాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం సిఐటియు గట్టుపల్ మండల జనరల్ బాడీ సమావేశం అచ్చిని బీరప్ప అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్మిక వర్గానికి వ్యతిరేకంగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేసే వరకు కార్మిక వర్గ పోరాటాలు ఆగవని హెచ్చరించారు.
దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను స్వదేశీ విదేశీ కార్పొరేట్ కంపెనీలకు ద్వారా దత్తం చేస్తుందని విమర్శించారు. ప్రజల అసంతృప్తిని పక్కదారి పట్టించడానికి చేయడానికి విద్వేష రాజకీయాలు చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే కార్మిక వర్గ సమస్యలు పరిష్కరిస్తామని అందరికీ కనీస వేతనాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిందని కానీ 19 నెలలు గడిచిన ఏ ఒక్క రంగానికి చెందిన కార్మికుల సమస్యలు పరిష్కరించలేదని విమర్శించారు.
పైగా షెడ్యూల్ పరిశ్రమల్లో కనీస వేతనాలు జీవోలు తక్కువగా సవరించి కోటి 20 లక్షల మంది కార్మికులకు ద్రోహం చేశారని అన్నారు.కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్ తెచ్చి కార్మిక వర్గాన్ని దోచుకోవడానికి పెట్టుబడుదారులకు అవకాశం ఇస్తే అదేవిధంగా ఈ రాష్ట్రంలో పరోక్షంగా కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తుందని దానికి పని గంటల పెంపు ఉదాహరణ అని అన్నారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీల అమలు చేయకపోతే భవిష్యత్తులో ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.