3 July, 2026 | 2:26 AM

వారసత్వ సంపద రామప్పను కాపాడాలి

03-07-2026 01:18 AM
  1. ఓపెన్ కాస్ట్ ప్రతిపాదనను విరమించుకోవాలి
  2. రామప్ప పరిరక్షణ కమిటీ డిమాండ్

వెంకటాపూర్, జూలై 2 (విజయక్రాంతి): యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, చారిత్రక రామప్ప సరస్సు పరిరక్షణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రామప్ప పరిరక్షణ కమిటీ కన్వీనర్ అక్కిరెడ్డి వెంకట రాం మోహన్‌రావు కోరారు. రామప్ప ప్రాం తంలో ప్రతిపాదిత ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల ప్రాజెక్టుపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రామప్ప దేవాల యం, రామప్ప సరస్సు పరిరక్షణ కోసం 2009 సంవత్సరం నుంచే రామప్ప పరిరక్షణ కమిటీ నిరంతర ఉద్యమం చేస్తోందన్నా రు. గతంలో కోస్టల్ ప్రాజెక్టు టన్నెల్ బ్లాస్టిం గ్ పనుల వల్ల రామప్ప దేవాలయానికి ప్ర మాదం పొంచి ఉందని గుర్తించి, ప్రజలను చైతన్యపరిచి ఉద్యమం చేపట్టామని తెలిపారు.

ప్రస్తుతం వెంకటాపూర్ ప్రాంతంలో ప్రతిపాదిత ఓపెన్ కాస్ట్ బొగ్గు గని కారణం గా మరోసారి రామప్ప ప్రాంతానికి తీవ్ర ముప్పు ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. సుమారు 3 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగిన చారిత్రక రామప్ప సరస్సు మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా సుమారు వెయ్యి అడుగుల లోతులో చేపట్టే మైనింగ్ కార్యకలాపాలు, భారీ పేలుళ్ల ప్రభావంతో రామప్ప దేవాలయ నిర్మాణం పై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

రామప్ప అభివృద్ధికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రూ.150 కోట్ల నిధులు కేటాయించారని, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఒకవైపు కోట్లాది రూపాయలు వెచ్చిం చి అభివృద్ధి చేస్తూ, మరోవైపు ఓపెన్ కాస్ట్ గనులకు అనుమతులు ఇవ్వడం పరస్పర విరుద్ధమైన చర్య అని పేర్కొన్నారు. ఈ ప్రాం తంలోని సహజ వనరులు, పర్యావరణం, రామప్ప సరస్సు, స్థానిక ప్రజల జీవనాధారాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ప్రతిపాదనను నిలిపివేస్తున్నట్లు బహిరంగ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.