15 April, 2026 | 9:59 AM

గ్రామాల అభివృద్దే లక్ష్యంగా పని చేయాలి

27-12-2025 07:34 PM

కాంగ్రెస్ మండల అధ్యక్షులు కీసర 

మోతే,(విజయక్రాంతి):  గ్రామాల అభివృద్దే లక్ష్యంగా పనిచేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని కరకాయలగూడెం సర్వరం గ్రామాలలో వార్డ్ సభ్యుల ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న అయన సర్పంచ్ లకు వార్డ్ సభ్యులకు సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన గ్రామాలలో పార్టీలకు ప్రాధాన్యత లేకుండా ప్రతి ఒక్కరు కలిసి మెలిసి సహకరించుకోవాలని అర్హులైన పేదలకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందించాలని కోరారు.