27-12-2025 07:29:54 PM
బెజ్జంకి: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గుగ్గిళ్ళ గ్రామ పంచాయతీ కి నూతనంగా సర్పంచిగా ఎన్నికైన గుగ్గిళ్ళ మల్లయ్య, మాజీ ఎంపిటిసి, మాజీ సొసైటీ డైరెక్టర్ సీత లక్ష్మి భూమయ్యలు శనివారం హైదరాబాద్ లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పార్టీ చేరికల కార్యక్రమంలో పాల్గొని పార్టీలో చేరారు. రాష్ట్ర బిజెపి పార్టీ ఉపాధ్యక్షురాలు కొల్లి మాధవి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ లు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా నూతన సర్పంచ్ గుగ్గిళ్ళ మల్లయ్య మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలవడం జరిగిందని . గ్రామాల అభివృద్ధి బిజెపి పార్టీ తోనే అభివృద్ధి చెందుతాయని, బిజెపి పార్టీలో ఉంటే గ్రామం అభివృద్ధి చెందుతుందని బిజెపి పార్టీ లో చేరటం జరిగిందని తెలిపారు.