30-04-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 29(విజయక్రాంతి): కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్(టీజీయూసీటీఏ) నాయకులు ప్రభుత్వా న్ని కోరారు. వారిని రెగ్యులర్ చేయాలని కోరు తూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల్లో జరుగుతున్న సమ్మె 11వ రోజు కొనసాగింది. ఓయూ పరిపాలన భవనం ఎదుట కాంట్రాక్ట్ అధ్యాపకులు నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు విజేందర్‌రెడ్డి, ధర్మతేజ, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, తదితరులు మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి చొరవ తీసుకుని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. వేల్పుల కుమార్, ఉపేందర్, పరశురాములు, పరమేశ్ తదితరులు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డిని కలిసి వినతిపత్రా న్ని అందజేశారు.
కాకతీయ యూనివర్సిటీలో జరిగిన సమ్మెలో జేఏసీ నాయకులు డా.ఆశీర్వాదం, డా.ఏటీపీటీ ప్రసాద్, డా.గడ్డం కృష్ణ తదితరులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులర్ చేయాలని కోరారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని 1270కుటుంబాలు సమ్మెలో పాల్గొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
వివిధ యూనివర్సిటీల్లోనూ సమ్మె కొనసాగింది. ఈ సందర్భంగా పలు నిరసన కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమాల్లో డా. రామేశ్వర్, డా.కృష్ణవేణి, డా.కవిత, డా.శ్రీధర్‌కుమార్ లోథ్, డా.కనకయ్య, డా.సతీష్, డా.సూర్యనారాయణ, డా. చంద్రశేఖర్, డా.సునీత, డా.భాగ్య, డా.శ్రీలత, తదితరులు పాల్గొన్నారు.