calender_icon.png 1 May, 2025 | 8:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ఆదిరెడ్డి 28వ వర్ధంతి

30-04-2025 12:00:00 AM

మునగాల, ఏప్రిల్ 29: సూర్యాపేట జిల్లా మునగాల సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో నరసింహులగూడెం మాజీ సర్పంచ్ కామ్రేడ్ ముదిరెడ్డి ఆది రెడ్డి  28వ వర్ధంతి సందర్చిబంగా త్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించినారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు  మాట్లాడుతూ..ఆదిరెడ్డి  కేవలం పదవుల కోసం ఉద్యమం చేయలేదు. ఆయనకు ప్రజల హక్కులు ముఖ్యం. ప్రతీ పేదవాడి గుడిసెలో వెలుగును నింపడం ఆయన లక్ష్యం. నర్సింహులగూడెం, జగన్నాథపురం, రేపాల, కలువ వంటి గ్రామాల్లో ప్రజా సమస్యలపై నిరంతర పోరాటాలు నిర్వహించి, ప్రజల్లో చైతన్యాన్ని నింపారు.

ఆయన జీవితంలో ఎర్రజెండా ధ్వజం క్షణం కూడా తలదించలేదు.సమాజంలో బలమైన భూస్వామ్య నిర్మూలన కోసం ఆయనే మార్గదర్శిగా నిలిచారు. ‘పేద రైతుకి భూమి  సమాజానికి సమానత్వం‘ అనే నినాదంతో సాగిన ఆయన ఉద్యమం, ఇప్పటికీ ప్రజల మనసుల్లో అజరామరంగా నిలిచిపోయింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ  సభ్యులు సైదా, జూలకంటి విజయలక్ష్మి, బచ్చలకూర స్వరాజ్యం, మండల కమిటీ సభ్యులు చందా చంద్రయ్య , దేశి రెడ్డి స్టాలిన్ రెడ్డి, బోళ్ల కృష్ణారెడ్డి, మండవ వెంకటాద్రి, సుంకరి పిచ్చయ్య, రావులపెంట రమేష్, శాఖ కార్యదర్శి సరికొండ నాగరాజు, కిన్నెర వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.