calender_icon.png 10 July, 2025 | 5:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎడ్‌సెట్‌లో 96.38 శాతం ఉత్తీర్ణత

22-06-2025 12:17:03 AM

  1. 208 కాలేజీల్లో 18 వేల సీట్లు
  2. డిగ్రీ ఫలితాల తర్వాత కౌన్సెలింగ్

హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): మా సాబ్‌ట్యాంక్‌లోని తెలంగాణ ఉన్నత విద్యామం డలి కార్యాలయంలో చై ర్మన్ బాలకిష్టారెడ్డి, వైస్‌చైర్మన్ పురుషోత్తం, కార్యదర్శి శ్రీరామ్ వెంకటేశ్, కాకతీయ వర్సిటీ వీసీ ప్రతాప్‌రెడ్డితోపాటు ఎడ్‌సెట్ కన్వీనర్ బీ వెంకట్రామ్‌రెడ్డి శనివారం ఎడ్‌సెట్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో మొత్తం 96.38 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.

పరీక్షకు 38,754 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 32,106 మంది పరీక్షకు హాజరయ్యారు. 30,944 మంది ఉత్తీర్ణత సాధించారు. 7,217 మంది పురు షులు దరఖాస్తు చేసుకోగా 5,801 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 5,723 (98.66 శాతం) ఉత్తీర్ణులయ్యారు. మహిళలు 31,536 మంది దరఖాస్తు చేసుకోగా, 26,304 పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 25,220 (95.88 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు.

డిగ్రీ ఫలితాలు విడుదలయ్యాక ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ జారీ చేస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టా రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 208 కాలేజీల్లో గతేడాది 18,550 సీట్లకుగానూ 14,420 సీట్లు భర్తీ అయినట్టు పేర్కొన్నారు. గతంలో కంటే ఈసారి 8 వేల దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయన్నారు.

ఉపాధ్యాయ కోర్సు చేసే వారిలో ఎక్కువగా మహిళలే ఉంటున్నారని వెల్లడించారు. గతంలో ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సును అందుబాటులోకి తీసుకురావాలకున్నారు. కానీ, ఇంకా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేయూ వర్సిటీ వీసీ ఈమేరకు తెలిపారు.