calender_icon.png 8 September, 2025 | 10:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

16-12-2024 01:53:41 AM

* డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క 

ఖమ్మం, డిసెంబర్ 15 (విజయక్రాంతి): మధిర అభివృద్ధితోపాటు ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం మధిర నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. మధిర ఆర్.వి.కాంప్లెక్స్ నుంచి ఆత్మకూరు వరకు ఫుట్‌పాత్, సైడ్ డ్రైన్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మధిర పట్టణం అభివృద్ధికి కట్టుబడి కార్యక్రమాలను వేగవంతం చేశామని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వేమిరెడ్డి  శ్రీనివాసరెడ్డి, మిర్యాల వెంకటరమణ, వాసిరెడ్డి రామనాధం, కర్నాటి రామారావు పాల్గొన్నారు.