16-12-2024 01:53:15 AM
నారాయణపేట, డిసెంబర్ 15 (విజయక్రాంతి): నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని పడమటి ఆంజనేయ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం రథోత్సవ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సరేఖ హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు.
మక్తల్ ట్యాంక్‌బండ్ వద్ద కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, ఎస్పీ యోగేశ్ గౌతమ్ మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి నల్ల జానమ్మ దేవాలయానికి చేరుకుని పూజలు నిర్వహించారు. అనంతరం పడమటి ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకున్నారు. పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.