16-12-2024 01:57:23 AM
జగిత్యాల, డిసెంబర్ 15 (విజయక్రాంతి): అధికారాన్ని అడ్డుపెట్టుకొని కేసులతో, జీవోలతో తమను భయపెట్టాలని చూస్తే ప్రజా ఉద్యమం తప్పదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్‌ను హెచ్చరించారు. ఆదివారం జగిత్యాల జిల్లాలో కవిత పర్యటించారు. మొదట ధరూర్ శివారులోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేశారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అస్తిత్వంపై చేస్తున్న దాడిని గ్రామ గ్రామాన తిరుగుతూ ఎండగడతామన్నారు.
బతుకమ్మ పండుగను తాము విశ్వవ్యాప్తం చేస్తామన్నారు. రానున్న రోజుల్లో జగిత్యాల జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామన్న కవిత.. తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. కేసీఆర్ బొమ్మతో గెలిచిన సంజయ్ ఏ మొహం పెట్టుకొని అసెంబ్లీకి వెళ్తున్నాడని ప్రశ్నించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పాల్గొన్నారు.